కోలీవుడ్ డైరెక్టర్ శంకర్ తన సినిమాలను అద్భుతంగా మలుస్తాడు అనే పేరు ఉంది. రజనీకాంత్ తో ‘రోబో’ లాంటి బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చిన తరువాత ఆ స్థాయిలో మరో సినిమా నిర్మిద్దాం అన్న పట్టుదలతో ఆస్కార్ ఫిలిమ్స్ బ్యానర్ లో వి.రవిచంద్రన్ నిర్మాణంలో విక్రమ్ హీరోగా ప్రిస్టిజియస్ గా తెరకెక్కుతున్న సినిమా 'ఐ' అన్న విషయం తెలిసిందే.  దాదాపు మూడేళ్లుగా తెరకెక్కుతున్న ఈ సినిమా గురించి ఇటీవల శంకర్ తన మనోభావాలను మీడియాతో పంచుకున్నాడు. ఈ సినిమాకి డేట్స్ ఎక్కువగానే అవసరమౌతుందని చాలామంది వెనుకకు వెళ్ళి పోయారట. అయితే హీరో విక్రమ్ మాత్రం ఈ సినిమా చేయడానికి చాలా ఇంట్రెస్ట్ చూపించాడట. అడిగినన్ని డేట్స్ ఇవ్వడమే కాకుండా, ఈ సినిమా కోసం ఇంత వరకు ఎలాంటి రెమ్యూనరేషన్ తీసుకోలేదనీ దర్శకుడు శంకర్ చెపుతున్నాడు  సినిమా విడుదలైన తర్వాతే రెమ్యూనరేషన్ గురించి ఆలోచించమని అన్నాడట విక్రమ్. ఇది తన మూడు సంవత్సరాల కష్టం అని అంటు విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం అని ప్రకటించాడు శంకర్. ఇండియన్ సినిమాని ఒక స్టాండర్డ్ లో నిలిపే సినిమాగా ‘ఐ’ ఉంటుందని శంకర్ అంటున్నాడు. ప్రస్తుతం పరాజయాల బాటలో ఉన్న విక్రమ్ కెరియర్ ఈ సినిమా విజయం పైనే ఆధారపడి ఉంటుంది అని అంటున్నారు విశ్లేషకులు.  

మరింత సమాచారం తెలుసుకోండి: