ప్రస్తుతదేశ వర్తమాన పరిస్థితులలో ఎంత గొప్పవాడు అయినా తన పనులు అనుకున్నట్లు జరగాలి అంటే లంచం ఇవ్వాల్సి వస్తుంది అని చెప్పే ఒక ఆ శక్తికర విషయం. హీరో సూర్య విషయంలో లేటెస్ట్ గా జరిగింది సామాన్యంగా సినిమాలలో మన హీరోలు లంచం గురించి పుచ్చుకోవడం ఇవ్వడం గురించి భారీ ఎత్తున క్లాస్ పీకుతూ డైలాగులను చెపుతారు. అయితే నిజజీవితంలో మాత్రం కొన్నిసార్లు వాళ్ళు కూడా లంచం ఇచ్చి పని గడుపుకోవాల్సిన పరిస్థితి వారికీ కూడా తప్పదు. ఇక ఈమధ్య ‘సింగం’ అంటూ ఓ సీనియర్ పోలీసు ఆఫీసర్ గా అదరగొట్టిన తమిళ హీరో సూర్యా కూడా లంచం ఇచ్చాడు అంటే ఎవ్వరు నమ్మరు కానీ ఈ విషయం నిజంగానే జరిగింది. ఇక వివరాల లోకి వెళ్ళితే సూర్య, సమంత జంటగా ప్రస్తుతం 'అంజాన్' అనే సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమాలోని పాట చిత్రీకరణ కోసం ఇటీవల సూర్య, సమంత, పలువురు డాన్సర్లు పాల్గొనగా ముంబాయ్ లో ఓ పాట చిత్రీకరించారు. ఈ పాట కోసం డాన్సర్లందరినీ చెన్నయ్ నుంచే తీసుకెళ్లారట. దాంతో షూటింగ్ జరుగుతున్న సమయంలో ముంబాయ్ డాన్సర్లు లొకేషన్ కి వచ్చి నానా రభస చేశారట ఎందుకంటే సినిమా వాళ్ళ రూల్స్ ప్రకారం ఎక్కువ శాతం లోకల్ డాన్సర్లనే తీసుకోవాలి. కానీ అక్కడ మాత్రం అంతా చెన్నై డాన్సర్స్ తో తీస్తున్నారు. దీనితో అక్కడ వాళ్ళు గొడవ చేయడంతో చివరకు షూటింగ్ ఆగిపోయే ప్రమాదం కనిపించడంతో హీరో సూర్య రంగంలోకి దిగి గుట్టు చప్పుడు కాకుండా 60 వేలు లంచం ఇచ్చి ప్రాబ్లమ్ క్లియర్ చేశాడట మన సింగం హీరో. ఎంత సూపర్ హీరోలు అయినా లంచావతారం ముందు హీరోలు జీరోలే అనుకోవాలి.    

మరింత సమాచారం తెలుసుకోండి: