ప్రముఖ కోలీవుడ్ హీరో అజిత్‌కు టాలీవుడ్ లో కూడా వీరాభిమానులు ఉన్నారు. ప్రస్తుతం ఆయన సినిమాలు కోలీవుడ్ లో వరుస పెట్టి బ్లాక్ బస్టర్లు అవుతున్నాయి. అటువంటి మాస్ హీరో అజిత్ ను వైద్యులు తీవ్రంగా హెచ్చరించారని కోలీవుడ్ మీడియాలో కధనాలు వస్తున్నాయి. ఇంతకీ అజిత్ కు ఏమైంది అని అనుకుంటున్నారా గతంలో అజిత్ కార్ రేస్‌లో గాయపడిన సమయంలో ఆయన వెన్నెముకకు ఐదుసార్లు ఆపరేషన్ చేయించుకున్నారు.  ఆ తరువాత షూటింగ్‌లో పోరాట దృశ్యంలో రిస్క్ తీసుకుని నటించినప్పుడు మరోసారి కాలుకు తీవ్ర గాయాలయ్యాయి. దీంతో వైద్యులు అత్యవసర శస్త్ర చికిత్స చేయాలని సూచించారట. అయినా అజిత్ తాత్కాలికంగా వైద్యం చేయించుకుని ‘ఆరంభం’ చిత్రాన్ని పూర్తి చేశాడు. తరువాత ఆపరేషన్ చేయించుకుంటానన్న అజిత్ వైద్యుల సూచన పక్కనపెట్టి ‘వీరం’ షూటింగ్‌లో పాల్గొన్నాడు. ఆ చిత్రం పూర్తి అయిన నేపథ్యంలో మళ్లీ తాజాగా గౌతమ్ మీనన్ దర్శకత్వంలో నటించడానికి సిద్ధం అవుతున్నాడు.  నటుడు సూర్య ఈ చిత్రంలో నటించాల్సి ఉండగా దర్శకుడు గౌతమ్ మీనన్‌తో మనస్పర్థల కారణంగా ఆయన వైదొలిగాడు అన్న విషయం తెలిసిందే. ఈ చిత్రం షూటింగ్ త్వరలో ప్రారంభం కానుండటంతో అజిత్ వైద్యులను సంప్రదించాడు అని తెలుస్తోంది. దీంతో వైద్యులు వెంటనే శస్త్ర చికిత్స చేయాలని లేని పక్షంలో పరిస్థితి ప్రమాదకరంగా మారుతుందని అజిత్ ను డాక్టర్స్ హెచ్చరించారని కోలీవుడ్ మీడియా కధనం. ఇటువంటి పరిస్థుతులలో అన్న మాట ప్రకారం గౌతమ్ మీనన్ సినిమా కొనసాగించాలా లేకుంటే ఆపరేషన్ చేయించుకోవాలా అనే మానసిక వ్యధలో అజిత్ ఉన్నట్లుగా కోలీవుడ్ మీడియా వార్తలు వ్రాస్తోంది.  

మరింత సమాచారం తెలుసుకోండి: