బాలీవుడ్ బ్యూటీ విద్యా బాలన్, భట్ క్యాంప్ లోకి ఎంట్రీ ఇస్తోంది.లాస్ట్ ఇయర్ ఆషికి-2 వంటి రొమాంటిక్ లవ్ స్టోరీ తో సూపర్ హిట్ కొట్టిన మోహిత్ సూరి డైరెక్షన్లో మూవీకి గ్రీన్ సిగ్నలిచ్చింది విద్యా. పెళ్లైన తర్వాత కూడా బాలీవుడ్లో డర్టీ బ్యూటీ విద్యా బాలన్ జోరు ఏమాత్రం తగ్గలేదు. వెడ్డింగ్ కి ముందు డర్టీ పిక్చర్, కహానీ వంటి రెండు వరుస బ్లాక్ బస్టర్ హిట్లతో బాలీవుడ్ లో సెన్సేషన్ క్రియేట్ చేసిన విద్యా ఇప్పుడు కూడా అదే జోష్ కంటిన్యూ చేస్తోంది. వరుస సినిమాలు సైన్ చేస్తూ దూసుకుపోతోంది. ప్రజెంట్ విద్యా షాదీ కే సైడ్ ఎఫెక్ట్స్ తో పాటు బాబీ జాసూస్ సినిమాలతో బిజీ గా ఉంది. విద్యా-పర్హాన్ అక్తర్ జోడీగా తెరెకెక్కిన షాదీ కే సైడ్ ఎఫెక్ట్స్ ఫిబ్రవరి 28 న రిలీజ్ కి రెడీ అవుతోంది. దియా మిర్జా ప్రొడక్షన్ లో వస్తోన్న బాబీ జాసూస్ కూడా సమ్మర్ రిలీజ్ కి ప్లాన్ చేస్తున్నారు . ఈ రెండింటి తర్వాత తర్వాత విద్యా బాలన్ నటించే సినిమా కూడా కన్ఫామ్ అయ్యింది. మరోసారి డర్టీ హీరో ఇమ్రాన్ హష్మీతో జోడీ కట్టేందుకు గ్రీన్ సిగ్నలిచ్చింది విద్య. లేటెస్ట్ గా ఆషికి-2 వంటి లవ్ స్టోరీ తో సూపర్ హిట్ కొట్టిన డైరెక్టర్ మోహిత్ సూరి ఇమ్రాన్ హష్మీ-విద్యా బాలన్ జోడీగా హమారీ ఆదూరి కహానీ పేరుతో రొమాంటిక్ మూవీ తెరకెక్కించేందుకు ప్లాన్ చేస్తున్నాడు. మహేష్ భట్ విశేశ్ ఫిలింస్ ఈ మూవీని ప్రొడ్యూస్ చేస్తోంది. మర్డర్ -2వంటి ఎరోటిక్ థ్రిల్లర్ తో సెన్సేషన్ క్రియేషన్ చేసిన మోహిత్ సూరి.. లేటెస్ట్ గా వచ్చిన ఆషికి-2 వంటి ఫీల్ గుడ్ లవ్ ఎంటర్టైనర్ తో డైరెక్టర్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.. ఈ లేటేస్ట్ మూవీ కూడా రొమాన్స్ బేస్డ్ గా నే ఉంటుందని సమాచారం . ఇమ్రాన్ –విద్యా కాంబినేషన్లో ఇప్పటివరకూ డర్టీ పిక్చర్, ఘన్ చక్కర్ వంటి సినిమాలు వచ్చాయి. ఈ రెండు సినిమాలతో ఈ జోడీ హిట్ పెయిర్ గా గుర్తింపు తెచ్చుకుంది. ఈ కొత్త సినిమాతో హాట్రిక్ కంప్లీట్ అవుతుంది. మరి ఈ మూవీతో ఇమ్రాన్-విద్య జోడీ ఏ రేంజ్ సక్సెస్ కొడతారో లెట్స్ వెయిట్ అండ్ వాచ్.

మరింత సమాచారం తెలుసుకోండి: