ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, ప్రిన్స్ మ‌హేష్‌బాబు అంటే ఇండ‌స్ట్రీలో అంద‌రికీ భ‌లే క్రేజ్‌. టాలీవుడ్‌లో నెంబ‌ర్ వ‌న్ పొజిష‌న్ కూడ వీరిద్దరి మ‌ధ్యే దోబూచులాడుతుంది. ఇదిలా ఉంటే టాలీవుడ్ ఫిల్మ్ ఇండ‌స్ట్రీ నుండి అందిన స‌మాచారం మేర‌కు ఓ ఎక్స్‌క్లూజివ్ న్యూస్‌ను ఎపిహెరాల్డ్‌.కామ్ మీకు అందిస్తుంది. ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, ప్రిన్స్ మ‌హేష్‌బాబు ఇద్దరూ ఒకే మూవీలో న‌టిస్తే ఎలా ఉంటుంది. ఇది ఇప్పట్లో జ‌ర‌గ‌ని ప‌ని. కాని, ఒక‌సారి ప‌వ‌న్‌కు స‌ర్‌ఫ్రైజ్ ఇచ్చిన మ‌హేష్, ఇప్పుడు మ‌రోసారి అదే స‌ర్‌ప్రైజ్‌ను ఇస్తున్నాడు. ప‌వ‌న్‌క‌ళ్యాణ్‌, త్రివిక్రమ్ కాంబినేష‌న్‌లో వ‌చ్చిన జాల్సా మూవీకు మ‌హేష్‌బాబు బ్యాక్‌గ్రౌండ్ వాయిస్ ఓవ‌ర్ ఇచ్చి అభిమానుల‌ను థ్రిల్ చేశాడు. అయితే జాల్సా మూవీలో మ‌హేష్‌బాబు వాయిస్ ఓవ‌ర్ ఉంటుంద‌ని ప‌వ‌న్‌కు ఫైన‌ల్ అవుట్‌ను చూసే వ‌ర‌కూ తెలియ‌దంట‌. తీరా మ‌హేష్ వాయిస్ విన్న త‌రువాత ప‌వ‌న్ తెగ హ్యాపీగా ఫీల్ అయ్యి, మ‌హేష్‌కు ఫోన్ చేసి మ‌రీ థ్యాంక్స్ చెప్పాడ‌ట‌. ఇప్పుడు మ‌ళ్ళీ అదే సీన్ రిపీట్ అవుతుందని ఇండ‌స్ట్రీలో టాక్స్ వినిపిస్తున్నాయి. విక్టరీ వెంక‌టేష్‌, ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ల మ‌ల్టీస్టార‌ర్‌ల ఫిల్మ్‌కు మ‌హేష్‌బాబు మ‌ళ్ళీ బ్యాక్‌గ్రౌండ్ వాయిస్ ఇస్తున్నాడ‌ని, ఇప్పటికే దీనికి సంబంధించిన టాకింగ్స్ అయిపోయంటూ ఇండ‌స్ట్రీ అంటుంది. ఎందుకంటే ప‌వ‌న్ మ‌ల్టీస్టార‌ర్ ఫిల్మ్‌కు సంబంధించిన ప్రి ప్రొడ‌క్షన్ ప‌నులు శ‌ర‌వేగంగా జ‌రుగుతున్నాయి. అందుకే ఈ న్యూస్ బ‌య‌ట‌కు వ‌చ్చింది. మొత్తంగా ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ను మ‌హేష్‌బాబు మ‌రోసారి స‌ర్‌ప్రైజ్ చేశాడ‌ని అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: