చిన్న సినిమాలతో సూపర్ సెన్షేషనల్ క్రియేట్ చేసిన మారుతి ఇప్పటితరం దర్శకులకు మంచి ఆదర్శం. కాకపోతే మారుతి సినిమాలు కేవలం యూత్ కోసం తీయడమే ఫ్యామిలీ ఆడియెన్స్ ని ఇబ్బందికి గురిచేస్తున్నాయి. ఇక పోతే ప్రస్తుతం అల్లు శిరిష్ తో కొత్తజంట చేస్తున్న మారుతి. వెంకటేష్ హీరోగా రాధా అనే సినిమాను కూడా స్టార్ట్ చేశాడు. కొత్త జంట సినిమా మారుతి మార్క్ అంటే బూతు డైలాగ్స్ ఏమి లేకుండా క్లీన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా చిత్రీకరిస్తున్నట్లు ఎపిహెరాల్డ్‌.కామ్ కి అందిన సమాచారం. ఒకవేళ ఎక్కడన్నా మారుతి తన పైత్యాన్ని చూపిస్తుంటే దగ్గరుండి మరి అల్లు అరవింద్ సరిచేస్తున్నాడట. ఇక మారుతి వెంకీ రాధా సినిమా కూడా ఈ సమ్మర్ కల్లా షూటింగ్ కంప్లీట్ చేసుకుటుంది. ఈ ప్రయత్నంలోనే ఇంత బిజీగా ఉన్నా మారుతి తన నెక్ష్ట్ ఫిలిం ని కూడా చేయడానికి రెడీ అవుతున్నాడట. క్లోజ్ ఫ్రెండ్ అని టైటిల్ తో వస్తున్న ఈ సినిమాను మారుతి రాధా సినిమా కాగానే స్టార్ట్ చేసేస్తాడట. సో మొత్తానికి వరుసెంట సినిమాలు చేస్తూ మంచి పేరు సంపాధిస్తున్న మారుతి కొంచం ఫ్యామిలీ ఆడియెన్స్ ని కూడా దృష్టిలో పెట్టుకుని మంచి సినిమాలు తీయాలని కోరుకుంటున్నారు కొందరు అభిమానులు.

మరింత సమాచారం తెలుసుకోండి: