క‌ల‌ర్ ఫుల్ ఫిల్మ్ ఇండ‌స్ట్రీకు ఎంతో మంది యాక్టర్స్ వ‌స్తుంటారు. అయితే ఎవ‌రు వ‌చ్చినా, వారు మాత్రం త‌మ ప‌ర్సన‌ల్ లైఫ్ కోస‌మే క‌ష్టప‌డుతుంటారు. స్టార్‌డం ఉన్నంత కాలంలో మ‌నీను సంపాదించుకొని ఫిక్స్‌డ్ డిపాజిట్ చేసుకుంటారు. అయితే కొంత మంది యాక్టర్స్ మాత్రమే వారు సంపాదించుకున్న దాంట్లో స‌మాజానికి ఉప‌యోగ‌ప‌డే ప‌నులు చేస్తుంటారు. అలాంటి వారిలో టాలీవుడ్ ఫిల్మ్ ఇండ‌స్ట్రీలోని హీరోల‌లో చాలా త‌క్కువ మంది ఉంటారు. ఈ త‌ర‌హా స‌మాజా సేవ దృక్ఫథం హీరోయిన్స్‌లో చాలా త‌క్కువుగా ఉంటుంది. కాని ప్రస్తుతం టాలీవుడ్ ఫిల్మ్ ఇండ‌స్ట్రీలో నెంబ‌ర్ వ‌న్ పొజిష‌న్‌ను కైవ‌సం చేసుకున్న స‌మంత‌, త్వర‌లోనే సోషియ‌ల్ ఆర్గనైజైష‌న్‌ను స్టార్ట్ చేస్తుంది. దీనికి సంబంధించిన ఎక్స్‌క్లూజివ్ స‌మాచారాన్ని పిహెరాల్డ్‌.కామ్ మీకు అందిస్తుంది. స‌మంత ఫిల్మ్ ఇండ‌స్ట్రీకు రాక ముందు నుండే స‌మాజ సేవ చేయాల‌ని మ‌దిలో బ‌లంగా ఉండేద‌ట‌. అందుకు త‌గిన స‌మ‌యం కోసం వేచి చూస్తుంది. ఇప్పుడు ‘ప్రత్యూష’ అనే వెల్ ఫేర్ ఆర్గనైజేషన్‌ ను సమంత ప్రారంభించింది. ఇందుకు సంవ‌త్సరం నుండి తీవ్రంగా క‌ష్టప‌డింది. ఈ ఆర్గనైజేష‌న్‌తో స‌మాజానికి త‌న వంతుగా సేవ చేయాల‌ని నిర్ణయించుకుంది. ప్రస్తుతం స‌మంత నాలుగు మూవీల‌లో న‌టిస్తూ బిజిగా ఉంది. సమాజం కోసం స‌మంత చేస్తున్న కృషికి ఇండ‌స్ట్రీ పెద్దలు సైతం అభినందిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: