టాలీవుడ్‌, కోలీవుడ్ ఫిల్మ్ ఇండ‌స్ట్రీలలో త‌న‌దైన స్టార్‌డంను క్రియోట్ చేసుకున్న హ‌న్సిన లేటెస్ట్‌గా ఓ ఫొటోషూట్‌ను తీయించుకుంది. ఆ ఫోటోషూట్‌కు సంబంధించిన ఓ విష‌యాన్ని ఎపిహెరాల్డ్‌.కామ్ ప్రత్యేకంగా మీకు అందిస్తుంది. లేటెస్ట్‌గా హ‌న్సిక తీయించుకున్న ఫోటోషూట్‌లో హ‌న్సిక బ‌రువు త‌గ్గిపోవ‌టాన్ని అంద‌రూ గుర్తించారు. దీంతో హ‌న్సిక త‌న కొత్త ఫోటోషూట్‌పై ఎంతో సంతోషంగా ఉంది. హ‌న్సిక బ‌రువుపై కోలీవుడ్ ఇండ‌స్ట్రీ విప‌రీతంగా కామెంట్స్ చేసింది. ఈ కామెంట్స్‌కు కార‌ణం ఏంటంటే స‌మంత కాబోయో జూనియ‌ర్ ఖుష్భూ అంటూ ఏకంగా ఫాట్ బ్యూటీ అంటూ ముద్దుగా పిలుచుకుంటున్నారు. ఇండ‌స్ట్రీలో త‌ను ఇంకా ఎన్నో మూవీల్లో న‌టించాలి కాబ‌ట్టి, అప్పుడే త‌న‌పై ఫాట్ హీరోయిన్ అనే ముద్ర ప‌డ‌టం త‌న‌కిష్టం లేదు. అందుకే త‌ను బ‌రువు త‌గ్గాల‌ని గ‌ట్టిగా నిర్ణయించుకుంది. గ‌త ఎనిమిది నెలల నుండి హ‌న్సిక త‌న బ‌రువుపై పూర్తి శ్రద్ధతో డైట్‌ను ఫాలో అవుతుంది. అలాగే స్పష‌ల్ ట్రైనింగ్ తీసుకుంది. ఆ కార‌ణంగానే హ‌న్సిక బ‌రువు త‌గ్గి చూపించింది. అందుకు నిద‌ర్శనంగానే హ‌న్సిన ఓ ఫోటోషూట్‌ను తీసి చూపించింది. హ‌న్సిక ఫోటోషూట్‌ను చూసి అంద‌రూ కూడ చాలా స్లిమ్‌గా ఉన్నావ్ అంటూ కామెంట్స్ చేస్తున్నారంట‌. మొత్తానికి మొన్నటి వ‌ర‌కూ బ‌రువుతో క‌నిపించిన హ‌న్సిక‌, ఒక్కసారిగా స్లిమ్ ఫిట్‌లోకి మారిపోవ‌డం చూసిన అభిమానులు మ‌రింత ఖుషీ అవుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: