బాలీవుడ్ ఫిల్మ్ ఇండ‌స్ట్రీలో ల‌వ్ ఎఫైర్స్ చాలా వైరైటీగా ఉంటాయి. అయితే రీసెంట్‌గా ర‌ణ్‌భీర్ క‌పూర్ త‌న మాజీ ల‌వ‌ర్ క‌త్రినాకైఫ్‌ను అవ‌మాన‌ప‌రిచాడు. బిటౌన్‌లో వినిపిస్తున్న దీనికి సంబంధించిన స‌మాచారాన్ని ఎపిహెరాల్డ్‌.కామ్ ఎక్స్‌క్లూజివ్‌గా అందిస్తుంది. బిటౌన్ స‌మాచారం మేర‌కు ర‌ణ్‌భీర్ క‌పూర్, క‌త్రినాకైఫ్‌ను అవ‌మానించాడ‌ని తెలుస్తుంది. ర‌ణ్‌బీర్‌క‌పూర్‌, క‌త్రినాకైఫ్‌లు ఇద్దరూ గ‌త నాలుగు సంవ‌త్సరాలుగా ఎఫైర్‌ను కొన‌సాగిస్తున్నారు. రీసెంట్‌గా ర‌ణ్‌భీర్‌క‌పూర్, క‌త్రినా ముందు పెళ్ళి ప్రపోజ‌ల్‌ను పెడితే త‌ను మాత్రం అందుకు నో అని చెప్పేసింది. దీంతో ర‌ణ్‌బీర్‌క‌పూర్‌ను ఘోర అవ‌మానం జ‌రిగింద‌ని బాలీవుడ్ భావించింది. ఎందుకంటే నిజానికి బాలీవుడ్ ఫిల్మ్ ఇండ‌స్ట్రీలో ర‌ణ్‌భీర్ క‌పూర్ ల‌వ‌ర్స్‌ను మార్చినంత‌గా ఏ హీరో మార్చడు. అలాంటిది క‌త్రినాకైఫ్‌తో అంత కాలం ఎఫైర్‌ను కొన‌సాగించ‌డం అంటే అదో పెద్ద వింత‌గా బిటౌన్ చెప్పుకుంటుంది. అలాంటి ర‌ణ్‌భీర్ క‌పూర్ స్వయంగా క‌త్రినాకైఫ్‌ను పెళ్ళి చేసుకుంటానంటే అందుకు క‌త్రినా నో చెప్పడం ర‌ణ్‌భీర్‌కు న‌చ్చలేదు. దీంతో ఓ మీడియా ప్రెస్‌మీట్‌లో ర‌ణ్‌భీర్ క‌పూర్, క‌త్రినాకైఫ్‌ను ఉద్దేశించి మాట్లాడాడు. 'క‌త్రినాకైఫ్‌తో నాకు ఎటువంటి సంబంధం లేదు. త‌ను ఇక నా మూవీల‌లో న‌టించ‌దు. నా అప్‌క‌మింగ్ మూవీల‌లో దీపికా ప‌దుకొనె న‌టించే అవ‌కాశం ఉంద‌ని' ఓపెన్ స్టేట్‌మెంట్ ఇచ్చాడు. దీంతో ర‌ణ్‌భీర్ క‌పూర్ అన్న మాట‌లు బిటౌన్‌లో హాట్ టాపిక్స్ అయ్యాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: