ఆపిల్ బుగ్గల సుందరి తమిళ తంబీల చేత విపరీతంగా ఆరాదింపబడే హన్సిక మాస్ మహారాజ ఫై విచిత్ర కామెంట్ చేసింది. ప్రస్తుతం రవితేజ సరసన ‘పవర్' సినిమాలో నటించే అవకాశం దక్కించుకున్న హీరోయిన్ హన్సిక రవితేజపై విచిత్రమైన పొగడ్తల వర్షం కురిపిస్తోంది. ‘రవితేజ సార్ నాకు చాలా కాలంగా తెలుసు, ఆయన ఎంతో ఉదారత కలిగిన వ్యక్తి, టాలీవుడ్‌‍లో హాలీవుడ్ జిమ్ కారీ లాంటి గొప్ప నటుడు’ అంటూ గొప్పగా చెబుతోంది ఈ జూనియర్ ఖుష్బూ  హన్సిక ప్రస్తుతం తెలుగు, తమిళంలో దాదాపు 10 సినిమాల్లో నటిస్తూ ఫుల్ బిజీగా గడుపుతోంది. ఇంత బిజీగా ఉన్న హన్సిక సక్సెస్స్ సీక్రెట్ ఒకటి ఉంది అంటారు. దక్షిణాదిన ఓ విజ‌యం చేతికి ద‌క్కితే చాలు, ఉన్నఫ‌ళంగా బాలీవుడ్‌లో వాలిపోదామ‌ని చూస్తుంటారు క‌థానాయిక‌లు. అక్కడ అందుకొనే పారితోషికం, ల‌భించే ప్రచారం ఆస్థాయిలో ఉంటుంది కాబట్టి , అయితే ఉత్తరాదిపై మోజుతో ద‌క్షిణాదిని నిర్లక్ష్యం చేసి, భారీ మూల్యం చెల్లించుకొన్న క‌థానాయిక‌లు టాలీవుడ్ కోలీవుడ్ లో ఎంతోమంది ఉన్నారు.  కానీ హన్సిక మాత్రం ఆ జాబితాలో చేర‌లేదు. బాలీవుడ్ నుంచి ఈ బొద్దు సుందరికి అవకాశాలు వచ్చినా తనకు బాలీవుడ్ వెళ్ళే ఆలోచ‌న‌లు లేవు అంటోంది. తనకు త‌మిళ భాష‌ల్లో వ‌స్తున్న అవ‌కాశాల ప‌ట్ల చాలా సంతృప్తిగా ఉన్నాన‌ని చెపుతోంది. ఏమైనా హన్సిక రవితేజా ఫై పనిగట్టుకుని చేస్తున్న ఈ భజన టాలీవుడ్ హాట్ టాపిక్ గా మారింది.   

మరింత సమాచారం తెలుసుకోండి: