టాలీవుడ్ లో మారుతికి బూతు దర్శకుడిగానే ముద్ర. అయితే మారుతికి తాను దర్శకత్వం వహించిన సినిమాల వలెనే కాకుండా తాను నిర్మిస్తూ తన అసిస్టెంట్లు చేత దర్శకత్వం వహిస్తున్న సినిమాల తో ఈ బూతు ఇమేజ్ మరింత పెరిగింది. అయితే ఇది గమనించిన మారుతి దాని నుండి బయటపడడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తున్నాడు అన్న విషయం తెలిసిందే. ప్రస్తుతం మారుతి దర్శకత్వంలో వస్తున్న ‘కొత్త జంట’ సినిమాతో పాటు సెట్స్ మీదకు వెళ్ళిన వెంకీ ‘రాధా’ సినిమాలో కూడా బూతు పాళ్ళు లేకుండా చేసుకుంటున్నాడని టాక్ ఉంది.  సుమంత్ అశ్విన్, నందిత జంటగా తెరకెక్కుతున్న ‘లవర్స్’ సినిమా నిర్మాతలలో మారుతి కూడా ఒకడు. తాజాగా ఈ సినిమా టీజర్ హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్ లో విడుదల చేయడం జరిగింది. నితిన్ ఈ టీజర్ ను రిలీజ్ చేశాడు, అయితే ఈ ఫంక్షన్ లో హీరో నితిన్ మారుతీని ఉద్దేసించి అన్న మాటలు టాక్ అఫ్ ది టాలీవుడ్ గా మారాయి. ఈ సందర్భంలో నితిన్ మాట్లాడుతూ ‘మారుతి బూతు సినిమాలు తీసాడు. కానీ ఇప్పుడు మారాడని అనుకుంటున్నాను. లవర్స్‌తో పాటు అతను తీస్తున్న కొత్తజంట కూడా క్లీన్‌ మూవీస్‌ అవుతాయని ఎక్స్‌పెక్ట్‌ చేస్తున్నాను’ అనేసరికి మారుతి ముఖంలో నెత్తుటి చుక్క లేక పోవడం అందరికి స్పష్తం గా కనిపించింది.  నితిన్ ఇలా పబ్లిక్‌ వేదికపై చేసిన కామెంట్ కు. లవర్స్‌ యూనిట్‌ అంతా విస్తుపోయారు ఇంతకుముందు మారుతితో నితిన్‌ ఒక సినిమా చేద్దామని అనుకున్నాడు అని అంటారు. కానీ మారుతీ తన బ్రాండ్‌ కథ ఒకటి చెప్పేసరికి నితిన్‌ భయపడి తప్పుకున్నాడు అని అంటారు. ఆ అనుభవంతోనే మారుతిని నితిన్ ఇలా అని ఉంటాడు అనే మాటలు విన పడుతున్నాయి.  అనుకోని ఈ మాటలకు సమాధానంగా ఇదే వేదిక ఫై మారుతీ మాట్లాడుతూ ఈ చిత్రానికి సంబంధించి క్రియేటివ్‌గా తన ఇన్‌వాల్వ్‌మెంట్‌ ఏదీ లేదని, ఈ చిత్రం బాగున్నా, బాగోకపోయినా అది యూనిట్‌కే చెందుతుంది తప్ప తనకేమీ దక్కదని తప్పించుకోవడం అందర్నీ ఆశ్చర్య పరిచింది.  

మరింత సమాచారం తెలుసుకోండి: