ప్రస్తుతం మార్కెట్లో ఉన్న ఇండియా టుడే పత్రిక పవన్ స్పెషల్ ఎడిషన్ పవన్ అభిమానులకే కాదు అందరికీ హాట్ మ్యాగజైన్ గా మారిపోయింది. ఈ స్పెషల్ ఎడిషన్ సేల్స్ ఇండియా టుడే యాజిమాన్యాన్నే ఆశ్చర్య పరుస్తున్నాయట. పవన్ వ్యక్తిగత జీవితంలోని అనేక ఆ శక్తికర విషయాలు ఈ స్పెషల్ ఎడిషన్ లో ముద్రింప బడ్డాయి. పవన్ కు వ్యసాయం పట్ల ఉండే ఇష్టం సమాజంలో జరిగే అన్యాయాల పట్ల పవన్ కళ్యాణ్ ప్రతిస్పందన ఇండియా టుడే కి ఇచ్చిన ఇంటర్వూలో పవన్ తన మనస్సులో అభిప్రాయాలను వివరంగా తెలియచేసాడు.   తాను ఎప్పుడూ తోటమాలి అవ్వాలని కోరుకుంటానని అంటు తాను ఎక్కువ సేపు తన సమయాన్ని తోటలో గడపటానికి ఇష్టపడతాను అన్నాడు పవన్. రంగారెడ్డి జిల్లా శంకరపల్లి మండలం ధన్ వాడా లో ఈ ఫామ్ హౌస్ ఉంది. ఇక్కడ పవన్ కళ్యాణ్ రెస్ట్ తీసుకోవటం, కొన్ని చిత్రాలుకు షూటింగ్ కు దీనిని వినియోగిస్తూంటారట. పవన్ కళ్యాణ్ షూటింగ్ లేని సమయంలో ప్రకృతిలో గడుపుతూండట. పవన్ ఫామ్ హౌస్ లో మామిడి తోటలూ, పండ్ల తోటలూ పెంచుతున్నాడు. ఆకు కూరలూ, కొన్ని రకాల కూరగాయలూ పండిస్తున్నాడు. పాడిగేదెలూ ఎక్కువగానే ఉంటాయట. అక్కడ ఓ పూర్తిస్థాయి రైతులా మారిపోయి పొలం పనులు చేస్తుంటాడు. ట్రాక్టర్‌తో దుక్కి దున్నడం, మొక్కలకు నీళ్లు పట్టడం, ఎరువులు చల్లడం, మందులు పిచికారీ చేయడం లాంటి పనులన్నీ చేస్తున్న పవన్ ను చూసి ఇండియా టుడే పత్రిక తరపున వచ్చిన ప్రతినిధులు ఆశ్చర్యంగా చూసారట.  పవన్ తను నటించబోయే సినిమా కధలను కూడ ఈ ఫామ్ హౌస్ లోనే వింటూ ఉంటాడట. క్రేజ్ లోనే కాదు పవన్ కి,రజనీకి ఫామ్ హౌస్ జీవితంలోనూ పోలికలు ఉన్నాయని ఇండియాటుడే విశ్లేషించింది. కోట్ల సంపద ఉన్నా రజనీకాంత్‌ కూడ చాలా సాదా జీవితాన్నే కోరుకుంటాడు అన్న విషయం తెలిసిందే. ఆయనకు చెన్నై శివారులోని కేళంబాక్కంలో పెద్ద వ్యవసాయక్షేత్రం ఉంది. అందులో రకరకాల పంటలూ, మామిడి, జామ, సపోట లాంటి తోటలూ పెంచుతున్నారు రజిని. రజనీకాంత్‌ ఎక్కువగా ఈ పొలంలోనే గడుపుతాడట. కొన్నిసార్లు నెలల తరబడి ఇక్కడే ఉండిపోతాడట.  ఇటీవల రజనీకాంత్ శస్త్రచికిత్స చేయించుకున్నప్పుడు వ్యవసాయక్షేత్రం లో విశ్రాంతి తీసుకున్నాడు. ఫామ్‌హౌస్‌లో పనివాళ్లతో కలిసిపోయి తరచూ పొలం పనుల్లో సాయం చేస్తుంటాడు. ఈ వ్యవసాయక్షేత్రానికి ఎంతమంది వచ్చినా అందరికీ మజ్జిగా, పాలూ ఇవ్వడం రజినీ అలవాటు. పాపులారిటీ విషయంలోనే కాదు వ్యక్తిగత జీవితంలో కూడా అనేక పోలికలు పవన్, రజనీల జీవితాల మధ్య ఉన్నాయని ఇండియాటుడే తన విశ్లేషణలో తెలిపింది. పవనిజానికి అర్ధం చెప్పే ఎన్నో విషయాలు ఉన్న ఈ ప్రత్యేక సంచిక ప్రస్తుతం మీడియాలో టాపిక్ ఆఫ్ ది డేగా మారింది.  

మరింత సమాచారం తెలుసుకోండి: