మెగాప‌వ‌ర్‌స్టార్ న‌టిస్తున్న అప్‌కమింగ్ ఫిల్మ్ కృష్ణవంశీ ద‌ర్శక‌త్వంలో తెర‌కెక్కుతుంది. ఈ మూవీకు సంబంధించిన గుడ్‌న్యూస్‌ను రామ్‌చ‌ర‌ణ్, మెగా అభిమానుల‌కు చెప్పబోతున్నాడు. దీనికి సంబంధించిన న్యూస్‌ను ఎపిహెరాల్డ్‌.కామ్ ఎక్స్‌క్లూజివ్‌గా మీకు అందిస్తుంది. టాలీవుడ్ ఫిల్మ్ ఇండ‌స్ట్రీలో వినిపిస్తున్న స‌మాచారం ప్రకారం రామ్‌చ‌ర‌ణ్‌, కృష్ణవంశీ కాంబినేష‌న్‌లో తెర‌కెక్కుతున్న మూవీ ఫ‌స్ట్‌లుక్ రెడీ అయింద‌ని అంటున్నారు. అయితే దీనికి సంబంధించిన ఫ‌స్ట్‌లుక్‌ను ఎప్పుడు రిలీజ్ చేస్తే బాగుంటుంది అనే దానిపై చిత్ర యూనిట్‌లో టాపిక్స్ న‌డుస్తున్నాయి. అలాగే రామ్‌చ‌ర‌ణ్ పుట్టిన‌రోజు కూడ త్వర‌లోనే ఉండ‌టంతో అదే రోజున చ‌ర‌ణ్ న‌టిస్తున్న అప్‌క‌మింగ్ ఫిల్మ్ ఫ‌స్ట్‌లుక్‌ను రిలీజ్ చేస్తున్నట్టు విశ్వశ‌నీయంగా అందిన స‌మాచారం. కృష్ణ‌వంశీ సైతం రామ్‌చ‌ర‌ణ్ పుట్టిన‌రోజు సంద‌ర్భంగా మూవీ ఫ‌స్ట్‌లుక్‌ను రిలీజ్ చేయాలని నిర్ణ‌యించిన‌ట్టు తెలుస్తుంది. ప్రస్తుతం రామ్‌చ‌ర‌ణ్‌, కృష్ణ‌వంశీ కాంబినేష‌న్ మూవీ షూటింగ్ రామేశ్వ‌రంలో జ‌రుగుతుంది. ప్యామిలి ఓరియంటెడ్ మూవీతో తెర‌కెక్కుతున్న ఈ మూవీపై మెగా అభిమానుల్లోనూ అంచ‌నాలు భారీగానే ఉన్నాయి. మొత్తానికి రామ్‌చ‌ర‌ణ్ న‌టిస్తున్న మూవీ ఫ‌స్ట్ లుక్‌, మార్చి 27 అని తెలియడంతో అభిమానులు ఎంతో ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: