వచ్చే వారం మహా శివరాత్రి రోజున పవన్ తన అభిమానుల చేత అర్దరాత్రి జాగరణ చేయించ బోతున్నాడు. అయితే పవన్ చేయబోతున్న ఈ ప్రయోగం ఏదో ఆధ్యాత్మిక విషయానికి సంబంధించినది అని అనుకోకండి. పవన్ ప్రపంచ వ్యాప్తంగా ప్రతి తెలుగువారి ఇంటిలోనూ శివరాత్రి నాడు అర్దరాత్రి సమయంలో తన సినిమా ‘అత్తారింటికి దారేది’ సినిమా ద్వారా మళ్ళీ మరొకసారి బుల్లితెర పై కనిపించి తన అభిమానులచేతే కాకుండా తెలుగు వారి అందరిచేత శివరాత్రి జాగరణ చేయించబోతున్నాడు. తెలుస్తున్న సమాచారం మేరకు పవన్ ‘అత్తారిల్లు’ సేటిలైట్ రైట్స్ పొందిన మాటివి ఈ సినిమాను మహా శివరాత్రి సందర్భంగా ఫిబ్రవరి 27వ తారీఖున రిపీట్ టెలికాస్ట్ చేయబోతోంది. సంక్రాంతి పండుగ సందర్బంగా ఈ సంవత్సరం జనవరిలో టెలికాస్ట్ అయిన ఈ సినిమా ఛానల్ రేటింగ్స్ విషయంలో ఎటువంటి సంచలనం సృష్టించిందో అందరికి తెలిసిన విషయమే. ఇదే సంవత్సరం కలియుగ కృష్ణుడిగా ‘ఓమై గాడ్’ రీమేక్ ద్వారా రాబోతున్న పవన్ ఈ సినిమా విడుదల కాకుండానే తన అభిమానులచేత పవన్ నామస్మరణ పవిత్రమైన శివనామ స్మరణల మధ్య మరోసారి చేయించడానికి బుల్లితెర పై శివరాత్రి రోజున కనిపిస్తూ ఉండటoతో ఈ ‘అత్తారిల్లు’ రిపీట్ బుల్లితెర పై ఇంకా ఎన్ని సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి.  

మరింత సమాచారం తెలుసుకోండి: