ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్‌కు సంబంధించిన ఓ న్యూస్ టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో చ‌క్కెర్లు కొడుతుంది. ఆ స‌మాచారాన్ని ఎపిహెరాల్డ్‌.కామ్ ప్ర‌త్యేకంగా మీకు అందిస్తుంది.గ‌త రెండు సంవ‌త్స‌రాల క్రితం యుటివి మోష‌న్స్ పిక్ఛ‌ర్స్ ప్రిన్స్ మ‌హేష్‌బాబుతో, ప‌వ‌న్ క‌ళ్యాణ్‌తో ఒకే సారి చ‌ర్ఛ‌లు జ‌రిపింది. వీరిద్ద‌రితో ఓ మూడు మూవీల‌ను నిర్మించేందుకు గాను ఒక్క‌రికి 60 కోట్ల రూపాయ‌ల‌ను ఇచ్చేందుకు యుటివి సంస్థ సిద్ధంగా ఉన్న‌ట్టు అగ్రిమెంట్స్‌ను కూడ రెడీ చేసుకుంది. అయిత్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ మాత్రం ఆ ఆఫ‌ర్‌ను వ‌ద్దు అని సింగిల్ సిట్టింగ్‌లోనే యుటివి సంస్థ‌కు క్లారిటి ఇచ్చాడు. కాని యుటివి సంస్థ వారు మాత్రం మ‌రోసారి చ‌ర్ఛ‌లు జ‌రుపుదామ‌ని కోర‌గా, అందుకు స‌రే అన్న‌ట్టు ప‌వ‌న్ చెప్పాడు. త‌రువాత మ‌హేష్‌బాబుతో చ‌ర్చ‌లు జ‌రిపిన యుటివి సంస్థ‌, సుదీర్ఘ స‌మ‌యం త‌రువాత ఒక మూవీకు మ‌హేష్‌బాబు ఓకె చెప్పాడు. ఆ ప్రాజెక్ట్ స‌క్సెస్ అయితే మ‌రో మూవీకు కాల్షీట్స్ ఇవ్వ‌టానికి సిద్ధం అని అన్నాడ‌ట‌. ప్ర‌స్తుతం మ‌హేష్‌బాబు న‌టించ‌బోతున్న మూవీ, యుటివి సంస్థ నుండే వ‌స్తున్న‌దే. కొన్ని నెల‌ల త‌రువాత ప‌వ‌న్ క‌ళ్యాణ్‌తో యూటివి సంస్థ మ‌రోసారి చ‌ర్చ‌లు జ‌రిపింది. అందుకు ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఈసారి పూర్తి క్లారిటి ఇచ్చాడు. ఈ త‌ర‌హా డీలింగ్‌లు అంటే నాకు ఇష్టం ఉండ‌దు. ఇంత‌కు మించి ఏమి చెప్ప‌లేన‌ని అని ఆ డీల్ నుండి త‌ప్పుకున్నాడంట‌. దీనికి సంబంధించిన టాపిక్స్ ఇప్పుడు ఫిల్మ్ ఇండ‌స్ట్రీలో వినిపిస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: