ప్రియమణి తమిళ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తన కెరీర్ ని మొదలు పెట్టింది. కోలీవుడ్ ఇండ‌స్ట్రీ నుండే ప్రియ‌మ‌ణి ప్ర‌తిభ అన్నిఇండ‌స్ట్రీల‌కు తెలిసొచ్చింది. అలాగే కోలీవుడ్ లో చేసిన ‘ పరుత్తివీరన్’ సినిమాకి ప్రియ‌మ‌ణి నేషనల్ అవార్డు కూడా గెలుచుకుంది. ఇదిలా ఉంటే రీసెంట్‌గా ప్రియ‌మ‌ణికు ఆఫ‌ర్లు కొండంత దూరంలో కనిపిస్తున్నాయి. టాలీవుడ్ ఫిల్మ్ ఇండ‌స్ట్రీ, క‌న్న‌డ ఫిల్మ్ ఇండ‌స్ట్రీ నుండి ప్రియ‌మ‌ణికు ఆఫ‌ర్లు వ‌స్తున్నాయి కాని కోలీవుడ్ ఇండ‌స్ట్రీ నుండి మాత్రం అస్స‌లు రావ‌డం లేదు. దీనికి చాలానే కారణం ఉంది. అయితే రీసెంట్‌గా కోలీవుడ్ ఫిల్మ్ ఇండ‌స్ట్రీకు ప్రియ‌మ‌ణి గుడ్‌భై చెప్పేసింది. ఓ ర‌కంగా ప్రియ‌మ‌ణిను కోలీవుడ్ ఇండ‌స్ట్రీ గెట్ అవుట్ అన్న‌ద‌ని స‌మాచారం. ఓ ప్ర‌ముఖ టాబ్లాయిడ్ క‌థ‌నం ప్ర‌కారం కోలీవుడ్‌లో విశ్వ‌శ‌నీయంగా వినిపిస్తున్న స‌మాచారాన్ని ఎపిహెరాల్డ్‌.కామ్ ఎక్స్‌క్లూజివ్‌గా మీకు అందిస్తుంది. టాలీవుడ్‌, క‌న్న‌డ ఇండ‌స్ట్రీ, బాలీవుడ్ నుండి ప్రియ‌మ‌ణికు భారీగా ఆఫ‌ర్స్ వ‌స్తున్న‌ప్ప‌డు కోలీవుడ్ ఇండ‌స్ట్రీ నుండి వ‌చ్చిన ఆఫ‌ర్స్ లెక్క చేయ‌లేదు. అంతే కాకుండా ఆ ఇండ‌స్ట్రీ నుండి వ‌చ్చిన ఆఫ‌ర్స్‌ను చిన్న చూపుచూడ‌ట‌మే కాకుండా ప్రొడ్యూజ‌ర్స్‌ను అమానప‌రిచేదని టాక్‌. అందుకే ప్రియ‌మ‌ణిపై కోలీవుడ్ ఇండ‌స్ట్రీ వేటు వేసింది. అయితే ఈ వార్త‌లు బ‌య‌ట‌కు రాకుండా ప్రియ‌మ‌ణే ఓపెన్ స్టేట్‌మెంట్ ఇచ్చింది. నేను కోలీవుడ్‌లో ఇక న‌టించ‌ను అని నిర్ణ‌యం తీసుకుంది. దీంతో ఇప్పుడు ఈ టాపిక్ ఇండ‌స్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి: