సినిమా ఇండస్ట్రీ రాను రాను చాలా ఛెండాలంగా తయారవుతున్నదా..? అంటే అవుననే అని అనేలా చేస్తున్నాయి కొన్ని సినిమాలు. అవకాశాల కోసం అన్ని స్టూడియోల చుట్టూ పిచ్చి కుక్కల్లా తిరుగుతున్న స్టోరీ రైటర్స్.. డైరక్టర్స్ లకు అవకాశాలు ఇవ్వకుండా చెత్త సినిమాలు చేసే వారికి దర్శకత్వం చేసే అవకాశాలు ఇస్తున్నారు. రీసెంట్ గా చాలా సినిమాలు అలా చెత్త అని చెప్పడానికి కూడా పనికిరానంతలా ఉన్నాయి. ఎందుకీ ఆవేశం ఎందుకీ అసహనం అనుకుంటున్నారు కద.. నిన్న రిలీజ్ అయిన నా రాకుమారుడు సినిమా చూస్తే అనిపించిన ఫీలింగ్ అది. ఎందుకంటే చాలా మంది మంచి టాలెంటెడ్ రైటర్స్ అండ్ డైరక్టర్స్ తమలో ఉన్న టాలెంట్ ని ప్రూవ్ చేసుకోవడానికి ఎంతో ట్రై చేస్తున్నారు కాని అవకాశాలు మాత్రం సాధించలేక అలా కృష్ణా నగర్ లోనే ఉండిపోతున్నారు. కాని ఎవరినో ఒకరిని పట్టుకుని ఏదో ఓ సినిమా తీసేద్దాం అని తీసేస్తున్నారు మరి కొంతమంది దర్శకులు.. వారికి కావాల్సింది డబ్బు మాత్రమే టాలెంట్ ని ప్రూవ్ చేసుకోవడం కాదు. వీరిని చూసి అసలు టాలెంట్ ఉన్న వారిని పక్కన పెట్టేస్తున్నారు కొందరు ప్రొడ్యూసర్స్. ఏది ఏమైనా ఇండస్ట్రీలో మంచి రోజులు రావాలి టాలెంట్ ఉన్న ప్రతి ఒక్కరికి అవకాశం రావాలి కొత్త కథలు.. కొత్త క్రియేటివిటీ.. ఉన్న దర్శకులు టాలీవుడ్ కి వచ్చి మన సినిమాను ఆస్కార్ స్థాయికి తీసుకెళ్ళాలని కోరుకుంటుంది ఎపిహెరాల్డ్.కామ్.             

మరింత సమాచారం తెలుసుకోండి: