ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ స‌ర‌స‌న అత్తారింటికి దారేది మూవీలో న‌టించిన యాక్ట‌ర్ న‌దియా, త‌న‌ సెకండ్ ఇన్నింగ్స్ జెడ్ స్పీడ్‌లోదూసుకుపోతుంది. న‌దియా కాల్షీట్స్ దొర‌కాలంటే ప్రొడ్యూజ‌ర్స్‌కు సంవ‌త్స‌రం పాటు వేచి చూడాల్సిన ప‌రిస్థితి వ‌చ్చింది. ఇదంతా మిర్చి, అత్తారింటికిదారేది స‌క్సెస్‌ల ఎఫెక్ట్ అని టాలీవుడ్ అంటుంది. ఇదిలా ఉంటే ప్ర‌స్తుతం న‌దియా చేతిలో ఎనిమిది మూవీల వ‌ర‌కూ ఉన్నాయి. అన్ని మూవీలు క్రేజీ ఫిల్మ్స్‌గా తెర‌కెక్కుతున్న‌వే. దీనికి సంబంధించిన వివ‌రాల‌ను ఎపిహెరాల్డ్‌.కామ్ ఎక్స్‌క్లూజివ్‌గా మీకు అందిస్తుంది. ప్ర‌స్తుతం న‌దియా 'ఆగడు' సినిమాలో మహేష్ బాబుకి అక్కగా, 'దృశ్యం' తెలుగు రీమేక్ లో పోలీసాఫీసర్ గా, 'దృశ్యం' తమిళ వెర్షన్లో కమల్ సరసన కథానాయికగా, ఓ మళయాళ సినిమాలో కీలక పాత్రగా, ఎన్టీఆర్ నటించనున్న సినిమాలో మరో ముఖ్య పాత్రలో న‌దియా న‌టిస్తుంది. అలాగే నితిన్ న‌టిస్తున్న అప్‌క‌మింగ్ మూవీలో అమ్మ పాత్ర‌లో న‌దియాను ఎంపిక చేస్తున్న‌ట్టు స‌మాచారం. ఈ విధంగా న‌దియ తీరిక లేకుండా త‌న డే షెడ్యూల్ గ‌డిచిపోతుంది. ఇదిలా ఉంటే ఈ స‌మ‌యంలోనే న‌దియ త‌న రెమ్యున‌రేష‌న్‌ను డ‌బుల్ చేసింద‌నే టాక్స్ వినిపిస్తున్నాడు. దాదాపు న‌దియాకు ఇచ్చే రెమ్యున‌రేష‌న్, ఓ టాప్ హీరోయిన్‌కు ద‌గ్గ‌ర‌గా ఉంటుంద‌ని ఇండ‌స్ట్రీ నుండి అందిన స‌మాచారం. మొత్తానికి న‌దియా రెమ్యున‌రేష‌న్‌ను పెంచినా, అందరూ ఈమెను కోరుకుంటున్నారంట‌. దీంతో హీరోయిన్స్‌, న‌దియాను చూసి అసూయ ప‌డుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: