వెండితెర మన్మధుడు నాగార్జున తన మొదటి సినిమా గురించి కూడ పడనంత టెన్షన్ తన ముద్దుల కొడుకు అఖిల్ గురించి పడుతున్నాడని అనిపిస్తుంది. అక్కినేని వంశం నుండి మరో హీరో టాలీవుడ్ ఎంట్రీకి సిద్దంగా ఉన్న సంగతి తెలిసిందే. అఖిల్ ను క్రికెట్ స్టార్ ను చేయాలని అనుకున్న నాగార్జున ఆఖరికి అఖిల్ ను కూడా టాలీవుడ్ ఇండస్ట్రీకి తీసుకురావడం ఖాయం అని అధికారకంగా నాగార్జున ప్రకటించడమే కాకుండా ఇదే సంవత్సరం అఖిల్ ఎంట్రీ ఉంటుందని చెప్పడంతో రకరకాల ఊహగానాలు గత కొన్ని నెలలుగా టాలీవుడ్ లో హడావిడి చేస్తున్నాయి.  అక్కినేని కుటుంబం అఖిల్ ఎంట్రీకి భారీ కసరత్తులు చేస్తు ఉండటంతో అఖిల్ తొలి సినిమాకు దర్శకులుగా త్రివిక్రమ్, రాజమౌళి, శేఖర్ కమ్ముల పేర్లు హడావిడి చేసి చివరకు దేవకట్టా దగ్గర ఈ పేర్లు ఆగాయి. అయితే తాజాగా అఖిల్ ఎంట్రీకి సంబంధించి మరో దర్శకుడి పేరు బయటకు రావడం అందర్నీ ఆశ్చర్య పరుస్తోంది. ప్రస్తుతం మహేష్ బాబుతో ‘ఆగడు’ సినిమాతో బిజీగా ఉన్న శ్రీనువైట్ల ఆ సినిమా తర్వాత అఖిల్ బాధ్యతను తీసుకోనున్నాడని ఫిల్మ్ నగర్లో టాక్ నడుస్తోoది. ప్రస్తుతం అక్కినేని కుటుంబం-శ్రీనువైట్ల మధ్య ఈ సినిమాకు సంబంధించిన చర్చలు జరుగుతున్నాయని త్వరలోనే ఫైనల్ ప్రకటన రావచ్చని ఫిలిం నగర్ వర్గాలు అంటున్నాయి. అన్నీఅనుకున్నట్లు అన్నీ జరిగితే సెప్టెంబర్ 20న అంటే అక్కినేని జయంతి రోజున ఈ సినిమాను ప్రారంభిస్థారని ఫిల్మ్ నగర్ సమాచారం. ఇక ఈ సినిమాలో అఖిల్ కు జోడిగా హీరోయిన్ గా శ్రీదేవి కూతురు జాహ్నవి, నాగబాబు కూతురు నిహారిక, కమల్ కూతురు అక్షర పేర్లు ఎప్పటి నుంచో వినిపిస్తున్నాయి. ఇన్ని గందరగోళాల మధ్య నాగార్జునకు అఖిల్ టాలీవుడ్ ఎంట్రీ ఒక సమస్యగా మారింది అని అంటున్నారు.   

మరింత సమాచారం తెలుసుకోండి: