జీవితంలోని వివిధ దశల్లోని రొమాన్స్‌ని హైలైట్‌ చేస్తూ దర్శకులు సినిమాలు తీసి కాసులు పిండుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. ఈమధ్య ఇలాంటి సినిమాల ప్రయోగాలు చాలా జరుగు తూనే ఉన్నాయి. ఈ నేపధ్యంలో భార్యాభర్తల మధ్య ఉండే లవ్‌ని కొంచం హాట్ గా చూపించి హిట్ కోడదామని ఒక దర్శకుడికి వచ్చిన ఆలోచనకు రూపం త్వరలో రాబోతున్న 'కాఫీ విత్‌ మై వైఫ్‌' సినిమా అని అంటున్నారు.  కన్నడం లో తెరకెక్కుతున్న ఈ చిత్రం కాన్సెప్ట్‌ యూనివర్సల్‌గా కనెక్ట్‌ అవుతుందని అని అంటున్నారు దీనిని త్వరలో తెలుగులో రిలీజ్‌ చేస్తున్నారు. భార్యాభర్తల రొమాన్స్‌తో కొద్దిగా హాట్ సేనలు పెట్టి సినిమా తీసిన దర్శకుడు సేఫ్‌ సైడ్‌ లో ఉంటాడు. ఎందుకంటే అతను తెరకెక్కించేది లీగల్‌ రొమాన్స్‌ కదా! దీనితో రొమాన్స్‌కి లీగల్‌ యాక్సెప్టెన్సీ దొరకడంతో ఎంత ముందుకెళ్లినా సమస్య ఉండదు. సెన్సార్ సమస్యలు కూడా ఉండవు అందుకే ఈ సినిమాలోరొమాన్స్ ఎక్కువ డోస్‌లోనే ఉంది అనే వార్తలు వస్తున్నాయి. ఇందులో భార్యగా కన్నడ కనకాంబరం సింధు లోక్‌నాధ్‌ నటించింది. అంతే కాదు చాలా హాట్‌ సీన్స్‌లో ఆమె జీవించేసి నిజంగానే తన భర్తతోనే ఉన్నట్టు భ్రమ కల్పించిందట. ఈ వైఫ్‌కి ఆడియన్స్‌ నుంచి మంచి మార్కులు పడిపోతాయని, ఈ కాఫీ టేస్ట్‌గా ఉందని కాంప్లిమెంట్లు రావడంతో అప్పుడే బయ్యర్లు ఈ సినిమా వైపు చాలా ఆ శక్తిగా చూస్తున్నారు అనే వార్తలు రావడమే కాకుండా త్వరలోనే తెలుగు తెరపై మరో బూతు సినిమాకు రంగం సిద్దం అవుతోంది అనే వార్తలు వినిపిస్తున్నాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: