జూనియర్ ఎన్.టి.ఆర్ ఈ మధ్య కాలంలో సినిమాల పరంగా కొద్దిగా వెనుకపడ్డ సంగతి తెలిసిందే కదా.. బృందావనం తర్వాత ఓ రేంజ్ లో హిట్ అయిన సినిమా ఒక్కటి లేదంటే చూడండిమరి. లాస్ట్ ఇయర్ వచ్చిన దమ్ము.. బాద్షా కూడా నిరాశపరచడంతో సినిమాల విషయంలో చాలా కేర్ తీసుకుంటున్నాడు జూనియర్. సో అందుకే రభసలో ఏ చిన్న పొరపాటు జరగకుండా చూసుకుంటున్నాడు. ఇక జూనియర్ తన నెక్ష్ట్ సినిమాను ఎవరితో చేస్తే బాగుంటుందా అని ఆలోచిస్తున్న సమయంలో.. పూరి ఓ కథ పట్టుకుని ఎన్.టి.ఆర్ ని కలిశాడట. ఎలాగు సూపర్ స్టార్ మహేష్ పూరితో చేయడానికి కొద్దిగా టైం పడుతుంది కాబట్టి.. ఈలోగా జూనియర్ తో సినిమా తీసి పక్కన పడేద్దమని పూరి ఐడియా. ఐడియా అయితే బాగానే ఉంది కాని అసలే ఎన్.టి.ఆర్ ఇప్పుడు చాలా వెనుకబడి ఉన్నాడు. ఈ హీరోతో మరోసారి 'ఆంధ్రావాలా'లాంటి సినిమా తీశాడనుకోండి ఫర్ సపోజ్ అనుకోండి.. పూరి సంగతి అటుంచితే జూనియర్ మాత్రం అడ్రెస్ లేకుండా పోవడం ఖాయం. ఓ పక్క హీరోలందరు రికార్డుల మీద రికార్డులు కొట్టేస్తుంటే జూనియర్ ఎన్.టి.ఆర్ మాత్రం సినిమాను హిట్ కూడా చేసుకోలేకపోతున్నాడు. సో పూరితో చేసే ముందు ఎన్.టి.ఆర్ ఆలోచించుకుంటే మంచిది. ఎపిహెరాల్డ్.కామ్ ఎక్స్ క్లూజివ్ గా తెలుసుకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం వీరిద్దరి మధ్య చర్చలు బాగా జరుగుతున్నాయట.. ఇదేగనక నిజమైతే సినిమా హిట్ అయ్యేవరకు ఎన్.టి.ఆర్ ఫ్యాన్స్ కి డౌటే. ఎన్.టి.ఆర్ కి పూరి జగన్నాథ్ హిట్ ఇస్తాడా..?          

మరింత సమాచారం తెలుసుకోండి: