విలక్షణ నటుడు మోహన్ బాబు నోటికి టాలీవుడ్ లో చాలా మంది భయ పడతారు. సామాన్యం గా మోహన్ బాబు ఎవ్వరిని లెక్కచేయడు. అటువంటి మోహన్ బాబును లొంగతీసిన ఒక బాలీవుడ్ నిర్మాత గురించి కధలు కధలు గా చెప్పుకుంటున్నారు. బాలీవుడ్లో సంచలన విజయం నమోదు చేసిన చిత్రం ‘గోల్ మాల్ 3’ రోహిత్ శెట్టి దర్సకత్వంలో రూపొందిన ఆ చిత్రం అక్కడ సంచలన విజయం సాధించింది. అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైన్మెంట్ తో రూపొందిన ఈ చిత్రంలో అజయ్ దేవగన్, అర్షద్ వార్సీ, తుషార్ కపూర్ హీరోలుగా చేసారు. కరీనా కపూర్ హీరోయిన్ గా చేసింది. దీనిలో పాత్రలను,కొన్ని కీలకమైన సీన్స్ ను తీసుకుని దర్శకుడు శ్రీవాస్ దర్శకత్యం లో ‘పాండవులు పాండవులు తుమ్మెదా’ చిత్రం రూపొందించారు. దాంతో ఈ చిత్రం మొదటి నుంచీ గోల్ మాల్ 3 కి ప్రీమేక్ అనే ప్రచారం జరుగుతూ వచ్చింది. దీన్ని మోహన్ బాబు మొదటి నుంచీ అంతే సమర్ధవంతంగా ఖండిస్తూ వచ్చారు. తమకూ ఆ సినిమాకూ సంభంధం లేదని మీడియా సమావేసం ఏర్పాటు చేసి మరీ తెలియచేసారు. కానీ ఈ విషయమై బాలీవుడ్ నిర్మాతలు గట్టి పట్టుదలతో వ్యవహరించి, కోర్టుకు వెళ్లి మరీ కాంపన్షేషన్ గా డబ్బు వసూలు చేసారని ఫిల్మ్ నగర్ సమాచారం. ఫిల్మ్ సర్కిల్సో వినపడుతున్న దాన్ని బట్టి గోల్ మాల్ 3 నిర్మాతధిల్లాన్ మేహతా కు మోహన్ బాబు 90 లక్షలు రూపాయలు చెల్లించబట్టే చిత్రం స్మూత్ గా రిలీజైందని తెలుస్తోంది. కోర్ట్ కేసులకు భయపడి మోహన్ బాబు ఈ సెటిల్ మెంట్ చేసుకున్నాడు అని టాక్ . ఏమైనా మోహన్ బాబు ను భయపెట్టిన నిర్మాత గా బాలీవుడ్ నిర్మాత మెహతా రికార్డు ఎక్కాడు అనుకోవాలి.  

మరింత సమాచారం తెలుసుకోండి: