రాష్ట్ర విభజన పదికోట్ల తెలుగు ప్రజల భవిష్యత్తును అంధకారంలోకి నెట్టిoదని సమైక్య వాదులు తమ తీవ్ర నిరసన తెలియచేస్తూ ఉంటే రాష్ట్ర విభజన పరిణామాల నేపథ్యంలో తెలుగు సినిమా పరిశ్రమకు తీవ్రమైన నష్టం కలిగిందని కొందరు విశ్లేషణలు చేస్తున్నారు. అంతే కాదు ఈ రాష్ట్ర విభజన నిర్ణయం వలన దాదాపు 220 సనిమాలు అర్ధాంతరంగా ఆగిపోయాయని అంటున్నారు. నిర్మాత, తెలుగుదేశం పార్టీ నాయకుడైన అంబికా కృష్ణ ఈ వ్యాఖ్యలు చేసారు. తిరుమల శ్రీవారిని దర్శించుకోవడానికి వచ్చిన ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ మాటలు చెప్పారు. చిన్న సినిమాలు ఇప్పటికే అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని, విభజనతో ఆ ఇబ్బందులు మరింత తీవ్రమయ్యాయని అయన అభిప్రాయం పడుతున్నారు. అంతే కాదు రెండు రాష్టాల ఏర్పాటు వల్ల మున్ముందు సినిమాల విడుదల విషయంలో అనేక సమస్యలు ఏర్పడుతాయని ఆయన ఆవేదన వ్యక్తం చేసారు. ఇప్పటి వరకు తెలుగు సినీ పరిశ్రమకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ ఫిల్మ్ చాంబర్‌ మాత్రమే కీలక పాత్ర పోషించేది. కానీ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు పూర్తయిన నేపథ్యంలో ఇప్పుడిప్పుడే విస్తరిస్తున్న తెలంగాణ ఫిల్మ్ చాంబర్ కూడా తన కార్యకలాపాలు విస్తరించేందుకు ప్లాన్ చేసుకుంటోంది. ఆంధ్రప్రదేశ్ ఫిల్మ్ చాంబర్, తెలంగాణ ఫిల్మ్ చాంబర్ ల మధ్య చోటు చేసుకునే పరిణామాలు ఆసక్తికరంగా ఉంటాయని విశ్లేషకులు భావిస్తున్నారు.  ఇప్పటి వరకు టాలీవుడ్ లో గుత్తాధిపత్యం సాగిస్తున్న కొందరు పెద్ద నిర్మాతలు రాష్ట్ర విభజన నేపథ్యంలో డిస్ట్రిబ్యూషన్ వ్యవస్థలో తమ పట్టును కోల్పోయే అవకాశం ఉందని విశ్లేషణలు చేస్తున్నారు. ఏమైనా రానున్న రోజులలో రాష్ట్ర విభజన ప్రభావం టాలీవుడ్ ఫై తీవ్ర ప్రభావం చూపెట్టే అవాకాశాలు ఉన్నాయి అంటున్నారు .  

మరింత సమాచారం తెలుసుకోండి: