నంద‌మూరి బాల‌కృష్ణ న‌టిస్తున్న అప్‌క‌మింగ్ ఫిల్మ్ లెజెండ్ మూవీకు సంబంధించిన ఇంట్రెస్టింగ్ అనౌన్స్‌మెంట్ ఒక‌టి బ‌య‌ట‌కు వ‌చ్చింది. దీనికి సంబంధించిన స‌మాచారాన్ని ఎపిహెరాల్డ్‌.కామ్ ఎక్స్‌క్లూజివ్‌గా మీకు అందిస్తుంది. నంద‌మూరి బాల‌కృష్ణ న‌టిస్తున్న లెజెండ్ మూవీ ఆడియోను మార్చి 7న రిలీజ్ చేయ‌టానికి తేధీను ఖ‌రారు చేశారు. అలాగే రిలీజ్ డేట్‌ను కూడ ఫిక్స్ చేశారు. మార్చి 28న లెజెండ్ మూవీను రిలీజ్ చేస్తున్న‌ట్టు ప్రొడ్యూజ‌ర్లు అఫిషియ‌ల్ అనౌన్స్‌మెంట్ ఇచ్చారు. ఇదిలా ఉంటే ఈ మూవీపై అభిమానుల్లో విప‌రీత‌మైన అంచాన‌లు పెరిగిపోతున్నాయి. సింహా మూవీ త‌రువాత వ‌స్తున్న కాంబినేష‌న్ కావ‌డంతో, లెజెండ్ మూవీపై నంద‌మూరి అభిమానుల్లో హై ఎక్స్‌పెక్టేషన్స్ నెల‌కొన్నాయి. ఈ మూవీను చాలా రిచ్‌నెస్‌తో టెక్నిక‌ల్ వాల్యూస్‌తో తెర‌కెక్కించిన‌ట్టు నిర్మాత‌లు వివ‌రించారు. బోయ‌పాటి శ్రీను సైతం సింహా మూవీ కంటే లెజెండ్ మూవీ క‌థ‌ను మ‌రింత ప‌వ‌ర్ ఫుల్‌గా మార్చాడ‌ని చిత్ర యూనిట్ నుండి అందిన స‌మాచారం. లెజెండ్ క‌థ‌లో క‌థానుసారం మొత్తం 2 ఫ్లాష్‌బ్యాక్‌ ఎపిసోడ్స్ వ‌స్తాయ‌ని అంటున్నారు. ఈ రెండు మూవీకు ప‌వ‌ర్ ఫుల్ ఎపిసోడ్స్ అని చిత్ర యూనిట్ అంటుంది. సింహా మూవీలోని ప్లాష్‌బ్యాక్ ఎపిసోడ్ ఎంత ఎన‌ర్జిటిక్‌గా ఉంటుందో, దానికి ఏ మాత్రం త‌గ్గ‌కుండా లెజెండ్ మూవీలోనూ రెండు ఫ్లాష్‌బ్యాక్ ఎపిసోడ్స్‌ను తెర‌కెక్కించారు. మొత్తానికి మార్చి నెల అంతా బాల‌కృష్ణ మూవీ సంద‌డి చేయ‌నుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: