తనయుడిని హీరోగా పరిచయం చేస్తూ వినాయక్ డైరక్షన్లో ఓ సినిమా తీస్తున్నాడు మల్టి డైమన్షన్స్ బెల్లంకొండ సురేష్. బెల్లంకొండ శ్రీనివాస్ ను హీరోగా పరిచయం చేస్తున్న ఈ సినిమా టైటిల్ అల్లుడు శ్రీను అనే పేరుని పరిశీలిస్తున్నట్లు ఫిల్మ్ నగర్ సమాచారం. గార్జియస్ హీరోయిన్ సమంత ఇందులో హీరోయిన్ గా నటిస్తుంది. దాదాపు సంవత్సం కింద షూటింగ్ స్టార్ట్ అయిన ఈ సినిమా టాకీ పార్ట్ కంప్లీట్ అయ్యిందని చిత్రయూనిట్ చెబుతున్నారు. వినాయక్ మార్క్ కమర్షియల్ ఎలిమెంట్స్ తో వస్తున్న ఈ సినిమా బెల్లంకొండ శ్రీనివాస్ కి మంచి ఎంట్రీ ఇస్తుందని అంచనా వేస్తున్నాయి సిని వర్గాలు. ప్రొడ్యూసర్ గా సూపర్ గుడ్ మూవీస్ అందిస్తున్న బెల్లంకొండ మొదటిసారి తన కొడుకుని వెండితెరకు పరిచయం చేస్తున్న ఈ సినిమాకు చాలా కేర్ తీసుకుంటున్నాడని ఆయన సన్నిహితులు అంటున్నారు. క్యాచి టైటిల్ తో ఆకర్షిస్తున్న ఈ సినిమా టైటిల్ కి సినిమా స్టోరీకి కూడా ఇంటర్ లింక్ ఉంటుందట. సో మొత్తానికి బెల్లంకొండ ప్రయత్నం ఎంతవరకు సక్సెస్ అవుతుంది. సమంత అందాలతో ఆడియెన్స్ కి ఎర వేస్తున్న ఈ అల్లుడు శ్రీను సినిమ ఎంతవరకు ప్రేక్షకాదరణ పొందుతుందో రిలీజ్ అయితే గాని చెప్పలేం. ఎపిహెరాల్డ్.కామ్ కి అందిన సమాచారం ప్రకారం ఈ సినిమా టైటిల్ అల్లుడు శ్రీను కే ఫిక్స్ అయ్యే ఆలోచన ఉందట చిత్ర యూనిట్ కి. అంతేకాదు ఈ ప్రెస్టీజియస్ మూవీకి దేవిశ్రీప్రసాద్ మ్యూజిక్ అందిస్తుందటం విశేషం. బెల్లంకొండ సురేష్ తన కొడుకుకి హిట్ సినిమాను ఇస్తాడా..? వినాయక్ బెల్లంకొండ వారసుడిని హీరోగా నిలబెడతాడా..?         

మరింత సమాచారం తెలుసుకోండి: