నందమూరి బాలకృష్ణ హీరోగా బోయపాటి శ్రీను కాంబినేషన్లో వస్తున్న రెండవ సినిమా లెజెండ్. సింహా తర్వాత వీరి కాంబినేషన్లో వస్తున్న మూవీ కాబట్టి ఈ సినిమాపై భారి అంచనాలు నెలకొన్నాయి. సినిమా స్టార్ట్ అయిన దగ్గరనుండి సూపర్ క్రేజీ గా తయారైన లెజెండ్ ఫస్ట్ లుక్ తో నందమూరి ఫ్యాన్స్ ని ఇంకాస్త సినిమా మీద ఇంట్రెస్ట్ పెరిగేలా చేసింది. ఇక రీసెంట్ గా రిలీజ్ అయిన టైటిల్ లోగో కూడా ఆడియెన్స్ దగ్గర నుండి ఓ రేంజ్ లో రెస్పాన్స్ వస్తుంది. ఇక ఈ సినిమా ఆడియోని మార్చ్ 7 న రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ సినిమా ఆడియోని గ్రాండ్ గా ప్లాన్ చేస్తున్నారు దర్శక నిర్మాతలు. 1 సినిమా నిర్మించిన 14 రీల్స్ బ్యానర్లో ఈ సినిమాను రాం ఆచంట,గోపి ఆచంట,అనీల్ సుంకర నిర్మిస్తున్నారు. లెజెండ్ లో బాలకృష్ణ మరోసారి ఎక్స్ లెంట్ పర్ఫార్మెన్స్ ని ఆడియెన్స్ చూడబోతున్నారని చిత్ర యూనిట్ చెబుతుంది. ఈ సినిమాలో బాలయ్యతో రొమాన్స్ చేస్తున్నారు రాధికా ఆప్టే..సొహైల్ చౌహాన్ .. ఈ సినిమాకు స్పెషల్ ఎక్ట్రాక్షన్ మ్యూజిక్ డైరక్టర్ దేవి శ్రీ ప్రసాద్.. మ్యూజిక్ ని ఆడియెన్ కి ఏ విధంగా ఇస్తే కాచ్ చేస్తారో అలా క్యాచీ ట్యూన్స్ ఇచ్చి సినిమాకి ఆడియో కూడా చాలా ప్లస్ ఆయేలా చేస్తాడు దేవి. ఇక ఈ లెజెండ్ సినిమాకు కూడా తన మార్క్ మ్యూజిక్ ని అందిస్తున్నాడట దేవి. అన్ని హంగులు ముగించుకుని మార్చ్ 7 న ఆడియో రిలీజ్ చేసుకుంటున్న లెజెండ్. మార్చ్ 28న సినిమా రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమాతో బోయపాటి మరోసారి తన డైరక్షన్ స్టామినాను ప్రూవ్ చేసుకోబోతున్నాడని ఫిల్మ్ నగర్ సమాచారం. లెజెండ్ ఆడియో వేడుకలపై మీ స్పందన..?         

మరింత సమాచారం తెలుసుకోండి: