ప్రశాంత్ గుర్తున్నాడు కదా.. అదేనండి జీన్స్ సినిమాలో హీరో.. చాలా కాలంగా హిట్ కోసం తాపత్రయపడుతున్న ఈ హీరో ఇప్పుడు టాలీవుడ్ లో హిట్ అయినా ఓ సినిమాపై కన్నేశాడు. ఆ సినిమా ఏదో కాదు త్రివిక్రం,అల్లు అర్జున్ కాంబినేషన్లో వచ్చిన జులాయి సినిమా. జులాయి సినిమా ఎంతో స్టైలిష్ గా లాజికల్ గా సూపర్ గా ఆడింది. అల్లు అర్జున్ కి జత కట్టి త్రివిక్రం మరోసారి తన పెన్ పవర్ ఎలా ఉంటుందో చూపించాడు. ఇక్కడ ప్రేక్షకాదరణ పొందిన ఈ సినిమానే కోలీవుడ్ లో రీమేక్ చేస్తున్నాడు ప్రశాంత్. మరి అల్లు అర్జున్ లా అలరిస్తాడా లేడా అన్నది చూడాలి. మాటల మాంత్రికుడు ఎంతో శ్రమకోర్చి తీసిన ఈ సినిమాను కోళీవుడ్లో ఒక కొత్త డైరక్టర్ డైరెక్ట్ చేస్తున్నాడట. లాస్ట్ ఇయర్ రాజకోట రహస్యంతో ఓ ప్రయోగం చేసిన ప్రశాంత్ కి ఈ సినిమానైనా హిట్ ఇస్తుందా అని డౌట్ పడుతున్నారు సిని వర్గాలు. కోళీవుడ్ లో కూడా హీరోల మధ్య గట్టి పోటీ ఉంది.. మరి కుర్ర హీరోలంతా తమ తమ టాలెంట్ ని ప్రూవ్ చేసుకుంటున్నారు.ఆ కోవలో ప్రశాంత్ చాలా వెనుకపడ్డాడని చెప్పాలి. జులాయిగా ప్రశాంత్ ఎలా ఉండబోతున్నాడు ఎలా అలరించబోతున్నాడు అని తెలియాలంటే సినిమా రిలీజ్ అయ్యే దాకా వేచిచూడాల్సిందే.  జులాయి సినిమా ప్రశాంత్ చేయడంపై మీ కామెంట్..?   

మరింత సమాచారం తెలుసుకోండి: