నిన్న జరిగిన మెగా హీరో వరుణ్ తేజ్ సినిమా ప్రారంభోత్సవానికి వచ్చిన చిరు, పవన్ ల మధ్య జరిగిన కోల్డ్ వార్ మీడియాకు హాట్ టాపిక్ గా మారిపోయిన సంగతి తెలిసిందే. మెగా అభిమానులు చిరంజీవి, పవన్ లను ఒకేసారి ఒక ఫంక్షన్ లో చూడాలని అనుకున్న చాలారోజులు తరువాత చిరు, పవన్ లు నిన్న ఒక్కచోట కలిసారు. చిరంజీవి కంటే ముందుగా ఈ వేడుకకు వచ్చిన పవన్ అసహనంగా కనబడటమే కాకుండా తనకేమి సంబంధం లేదు అన్నట్లుగా ఒక మూల కూర్చున్నాడు.  ఈ నేపధ్యంలో చిరంజీవి వచ్చిన వెంటనే పూజా కార్యక్రమం ప్రారంభం కావడం వరుణ్ తేజ్ చిరంజీవి పాదాలకు నమస్కరించడం అన్నీ చకచకా జరిగిపోయాయి. పూజ తరువాత బ్రాహ్మణుడు ఇచ్చిన అక్షింతలను చిరూ వరుణ్ తేజ్ పై వేసి పక్కనే నిలబడి ఉన్న రాఘవేంద్రరావు చేతికి ఇచ్చారు. ఈలోపున ఈ పూజా తంతుకు దూరంగా ఉన్న పవన్ ను అటు నాగబాబు కాని ఇటు చిరంజీవి కాని దగ్గరకు రమ్మని పిలవక పోవడంతో అసలే తిక్క ఎక్కువగా ఉండే పవర్ స్టార్ కు కోపం వచ్చి వెంటనే వెళ్ళి పోయాడు అని టాక్. ఆతరువాత మైక్ అందుకున్న చిరంజీవి ‘నేను ఈ స్థాయికి రావడానికి కారణం ఫ్యాన్స్‌ అభిమానమే నేను 149 చిత్రాలు చేశాను. ఇండస్ట్రీ ముఖ్యులతో ఇలా గ్రాండ్‌గా నా సినిమా ఏదీ ఆరంభం కాలేదు. వరుణ్‌ తేజ్‌ 6.3 అంగుళాల ఎత్తుతో అందంగా ఉంటాడు. ఆ అందం చూస్తుంటే నాకే జెలసీగా ఉంది మంచి భవిష్యత్‌ ఉంది’ అని చిరంజీవి అన్నారు. ఈ మాటలు విన్న ఆహ్వానితులు మాత్రం కొత్త హీరోలను చూస్తు ఉంటే చిరంజీవికి జెలసీ పెరిగిపోతోందని, తన బాధను ఇలా సెటైర్ల రూపంలో వ్యక్త పరుస్తున్నాడు అనే కామెంట్లు వినిపించాయి.  

మరింత సమాచారం తెలుసుకోండి: