మెగా హీరో చిరంజీవి వారసత్వాన్ని కొనసాగిస్తూ ఇప్పటికే ఎందరో మెగా కుటుంబ హీరోలు టాలీవుడ్ లో తమ సత్తాను చాటుతూ ఉంటే ఈలిస్టులో మరో హీరో నిన్నటి నుంచి చేరాడు ఎప్పటి నుంచే మెగా అబిమానులను ఊరిస్తున్న 'వరుణ్ తేజ్' టాలీవుడ్ ఎంట్రీ కి నిన్న తెర లేచింది. ఫ్యామిలీ సినిమాల దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల చేతుల మీదుగా వరుణ్ లాంచ్ నిన్న ఘనంగా జరిగింది. నిన్న ఈ సినిమాకు మొదటి క్లాప్ కొట్టారు. మెగా విభేదాలు ఎలా ఉన్నా కానీ మెగా ఫ్యామిలీ ఆశీస్సులు మాత్రం వరుణ్ కి నిండుగా దక్కాయి. దీనితో పాటు వరుణ్ కు సంబంధించి ఓఫోటో సెషన్ ఆల్బంతో పాటు చిన్న వీడియో టీజర్ కూడా రిలీజ్ చేశారు. అయితే విడుదల చేసిన పోస్టర్స్ లో వరుణ్ లుక్ మీద మెగా ఫ్యాన్స్ లో మంచి స్పందన వచ్చింది. ఇప్పటివరకు లాంచ్ అయిన మెగా హీరోలలో అందగాడుగా వరుణ్ అప్పుడే క్రెడిట్ కొట్టేశాడు. వరుణ్ ను చూసి మెగాస్టార్ చిరంజీవే స్వయంగా జెలసీ ఫీల్ అయ్యాడంటే మెగా హీరోలలో నిజంగానే వరుణ్ ఆరడుగుల మూడంగుళాల అందగాడు' గా అప్పుడే రికార్డు కొట్టేసాడు అనే మాటలు ఫిలింనగర్ లో వినిపిస్తున్నాయి.  వరుణ్ మొదటి సినిమానే సీతమ్మ లాంటి ఫ్యామిలీ సినిమాలు తీసిన దర్శకుడు కావడంతో ఈ సినిమాలో మాస్, కమర్షియల్ అంశాలతో పాటు ఫ్యామిలీ ఎమోషన్స్ కూడా బాగ కలిపితే ఈ సినిమా సూపర్ హిట్ అవ్వడం ఖాయం అనే మాటలు అప్పుడే మొదలు అయ్యాయి. ఈ సినిమా సక్సెస్ అయితే ఇప్పుడున్న మెగాహీరోలకు వరుణ్ గట్టి పోటీ ఇవ్వడం ఖాయం అని అంటున్నారు..   

మరింత సమాచారం తెలుసుకోండి: