ప్రస్తుతం జూనియర్ తన ఆశలన్నీ ఈ సమ్మర్ కు రాబోతున్న ‘రభస’ పై నే పెట్టుకున్నాడు. కానీ ఈ సినిమా ప్రారంభం అయిన దగ్గరనుంచి జూనియర్ కు అన్ని సమస్యలే. అయినా ఆ సమస్యలు అన్ని ఎదిరుస్తూ జూనియర్ ‘రభస' రెగ్యులర్ షూటింగ్ జరుగుతోంది. ప్రస్తుతం పాటల చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ చిత్రంలో ఎన్టీఆర్ తండ్రి పాత్రలో ఓ స్టార్ హీరో కనిపించనున్నారంటూ వార్తలు వినిపిస్తున్నాయి.  ఆయన మరెవరో కాదు మళయాళ మెగాస్టార్ మోహన్ లాల్ అని అంటున్నారు. ఈ పాత్ర చాలా చిన్నదే అయినా ఆ పాత్రా ఉన్నంతసేపు సినిమాలో హైలెట్ గా ఉండే సీన్స్ ఉంటాయని టాక్. గతంలో మోహన్ లాల్ ‘గాండీవం’ చిత్రంలో బాలకృష్ణ తో చేసిన సంగతి తెలిసిందే.  పక్కా మాస్ ఎంటర్టైనర్ గా రూపొందుతున్న ఈ సినిమాలో జూనియర్ మరోసారి పాట పడబోతున్నాడు. తెలుస్తున్న సమాచారం మేరకు ఈసారి సమ్మర్ హడావిడి అంతా నందమూరి హీరోల సినిమాల లాగే కనిపిస్తోంది. మార్చి నెలాఖరున కానీ లేదంటే ఏప్రిల్ లో బాలయ్య ‘లెజెండ్’ తో వస్తే మే నెలాఖరుకు జూనియర్ రభస చేయడానికి వస్తూ సమ్మర్ సీజేన్ అంతా నందమూరి మయంగా మార్చేస్తున్నారు. అన్ని అనుకున్నట్లు గా ఈ రెండు సినిమాలు కూడా హిట్ అయితే ఒకే సీజన్లో ఒకే కుటుంబానికి చెందిన రెండు భారి సినిమాల హిట్ రికార్డు బాబాయి అబ్బాయి ల స్వంతం అవుతుంది.  

మరింత సమాచారం తెలుసుకోండి: