టాలీవుడ్ ఫిల్మ్ ఇండ‌స్ట్రీలో క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్ నుండి క‌మెడియ‌న్‌గా, క‌మెడియ‌న్ నుండి హీరోగా ఎదిగిన న‌టుడు సునీల్‌. సునీల్ త‌న‌దైన న‌ట‌న‌తో టాలీవుడ్ ఫిల్మ్ ఇండ‌స్ట్రీలో స్టార్‌డంను క్రియోట్ చేసుకున్నాడు. అందాల రాముడు మూవీతో హీరోగా ఎంట్రి ఇచ్చిన సునీల్‌ త‌రువాత నుండి హీరోగా మూవీల‌ను కంటిన్యూ చేసుకుంటూ వ‌స్తున్నాడు. ఈ ప్ర‌యత్నంలో సునీల్ కేవ‌లం హీరోగానే పాత్ర‌ల‌ను ఎంచుకుంటున్నాడు.ఈ క్ర‌మంలో మిగత క్యారెక్ట‌ర్ రోల్స్ ఎన్నో వ‌చ్చినా, వాటన్నింటిని వదులుకున్నాడు. ఇదిలా ఉంటే రీసెంట్‌గా సునీల్ హీరోగా చేస్తున్న మూవీలు బాక్సాపీస్ వ‌ద్ద అంత స‌క్సెస్‌ను సాధించ‌లేక‌పోతున్నాయి. దీంతో భ‌విష్య‌త్‌లో సునీల్ హీరోగా న‌టించిన మూవీలు ప్రొడ్యూజ‌ర్‌కు లాభాలు తెచ్చిప‌ట్ట‌డం ప‌క్క‌న పెడితే, క‌నీసం పెట్టిన మ‌నీ అయినా తిరిగి వ‌స్తుందా అనే అనుమానాలు ప్రొడ్యూజ‌ర్స్‌లో క‌లుగుతున్నాయి. హీరోగా ఉంటే సంవ‌త్స‌రానికి ఒక‌టి లేక రెండు మూవీల‌తో స‌రిపెట్టుకోవాలి. వాటిల్లోనూ స‌క్సెస్ ఉంటే మ‌ళ్ళీ హీరోకి స్టార్‌డం ఉంటుంది. స‌క్సెస్‌లు లేక‌పోతే అంతే ప‌రిస్థితి. ప్ర‌స్తుతం ఈ విధంగా ఆలోచిస్తున్న సునీల్‌, త్వ‌ర‌లోనే ఓ పెద్ద హీరో మూవీలో ఎప్ప‌టిలాగే ఓ క్యారెక్ట‌ర్ రోల్ చేయ‌టానికి ఒప్పుకున్నాడు. దీంతో సునీల్ హీరోగా త‌ప్పుకున్న‌ట్టే అని టాక్స్ వినిపిస్తున్నాయి. రీసెంట్‌గా వ‌చ్చిన భీమ‌వ‌రం బుల్లోడు మూవీ కూడ అంతంగానే ఉండ‌టంతో సునీల్ హీరోగా ఇక క‌ష్ట‌మే అని ఇండ‌స్ట్రీ అంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: