లెజెండ్ మూవీకు సంబంధించిన పనులు శ‌ర‌వేగంగా జ‌రుగుతున్నాయి. లెజెండ్ మూవీ షూటింగ్ దాదాపు పూర్తైన‌ట్టే అని చిత్రయూనిట్ నుండి అందిన స‌మాచారం. అలాగే కొద్దిపాటి ప్యాచ్ వ‌ర్క్స్ మిన‌హాయించి లెజెండ్ మూవీ షూటింగ్ షెడ్యూల్స్ అన్ని పూర్త‌య్యాయి. ఇదిలా ఉంటే ప్ర‌స్తుతం ఈ మూవీకు సంబంధించిన డ‌బ్బింగ్ పనులు ఊపందుకున్నాయి. దీనికి సంబంధించిన స‌మాచారాన్ని ఎపిహెరాల్డ్‌.కామ్ ఎక్స్‌క్లూజివ్‌గా మీకు అందిస్తుంది. లెజెండ్ మూవీ పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ పనులు మొద‌ల‌య్యాయి. లెజెండ్ మూవీ ఎడిటింగ్ చివ‌రి ద‌శ‌కు చేరుకుంది. ప్ర‌స్తుతం ఈ మూవీలోని పాత్ర‌లు డ‌బ్బింగ్ చెప్పుకుంటున్నాయి. అలాగే కొద్ది రోజుల్లోనే నంద‌మూరి బాల‌కృష్ణ కూడ త‌న పాత్ర‌కు డ‌బ్బింగ్ చెప్పుకోబోతున్నాడు. ఇదిలా ఉంటే ఈ మూవీకు సంబంధించిన ఆడియో, మూవీ రిలీజ్ డేట్స్‌ను సైతం నిర్మాత‌లు అప్పుడే బ‌య‌ట‌కు అనౌన్స్‌మెంట్ చేశారు. దీంతో లెజెండ్ మూవీపై అభిమానుల్లో ఆస‌క్తి నెల‌కొంది. మార్చి 7న లెజెండ్ మూవీ ఆడియో రిలీజ్‌, అలాగే మార్చి 28న లెజెండ్ మూవీ రిలీజ్ డేట్స్ అంటూ నిర్మాత‌లు డేట్స్‌ను ఫిక్స్ చేశారు. ఈ మూవీలో నంద‌మూరి బాల‌కృష్ణ స‌ర‌స‌న రాధిక ఆప్టే హీరోయిన్‌గా న‌టిస్తుంది. సింహా త‌రువాత వ‌స్తున్న కాంబినేష‌న్ కావ‌డంతో ఈ మూవీపై చిత్ర ప‌రిశ్ర‌మ‌లోనూ ఎక్స్‌పెక్టేష‌న్స్ ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: