టాలీవుడ్ ఫిల్మ్ ఇండ‌స్ట్రీలో టాప్ హీరోయిన్‌గా కొన‌సాగిన కాజ‌ల్ అగ‌ర్వాల్‌పై గ‌త కొంత కాలంగా పెళ్ళికు సంబంధించిన వార్త‌లు వినిపిస్తూనే ఉన్నాయి. ముంబాయ్ బిజినెస్ మేన్‌తో ప్రేమ‌లో మునిగింద‌ని, త‌న‌నే త్వర‌లో పెళ్ళి చేసుకుంటుంద‌నే వార్త‌లు మీడియాలో హ‌ల్‌చ‌ల్ చేశాయి. ఇదిలా ఉంటే పెళ్ళికు సంబంధించిన వార్త‌ల‌పై కాజ‌ల్ క్లారిటి ఇచ్చింది. ఈ న్యూస్‌ను ప్ర‌త్య‌కంగా ఎపిహెరాల్డ్‌.కామ్ ఎక్స్‌క్లూజివ్‌గా మీకు అందిస్తుంది. కాజ‌ల్ అగ‌ర్వాల్ ముంబాయ్ బిజినెస్ మెన్‌తో ప్రేమ వ్య‌వ‌హారం న‌డుపుతుంద‌నే వార్త‌ల‌లో ఏ మాత్రం నిజం లేద‌ని కాజ‌ల్ అగర్వాల్ స్టేట్‌మెంట్ ఇచ్చింది. అంతే కాకుండా 'నేను క‌చ్ఛితంగా పెళ్ళి చేసుకుంటాను, అదీనూ ల‌వ్ మ్యారేజ్ మాత్ర‌మే చేసుకుంటాను. ప్ర‌స్తుతం నాకు పెళ్ళి చేసుకునే ఆలోచ‌న‌లు లేవు కాని, నాకు న‌చ్చిన వ్య‌క్తి క‌నిపిస్తే మాత్రం, క‌చ్ఛితంగా పెళ్ళి చేసుకుంటాను. ఆ వివ‌రాల‌ను త్వ‌ర‌లోనే మీకు చెబుతాను' అని చెప్పింది. అయితే కాళహ‌స్తిలో చేయించుకున్న పూజ‌ల‌పైనా క్లారిటి ఇచ్చింది. త‌న ప్రెండ్స్ తిరుప‌తిలో ఉంటే అక్క‌డ వ‌చ్చిన త‌రువాత‌, అక్క‌డ నుండి కాళ‌హ‌స్తి ద‌గ్గ‌ర కాబ‌ట్టి త‌ను కాళహ‌స్తి వెళ్ళి పూజ‌లు పూజ‌లు చేయించుకుంది. అంత‌కు మించి ఆ పూజ‌ల‌కు, త‌న‌ పెళ్ళికు ఎటువంటి సంబంధం లేదంటూ చెప్పుకొచ్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి: