వెరైటీ సినిమా టైటిల్‌ తో హడావిడి చేస్తున్న ట్రైలర్లతో గత కొంత కాలంగా ప్రేక్షకుల్లో ఆసక్తిరేపుతున్న చిత్రం ‘హృదయ కాలేయం'. ఎ కిడ్నీ విత్ హార్ట్ అనే ట్యాగ్ సినిమా ఆడియో వేడుక నిన్న భాగ్యనగరంలో జరిగింది. కావ్యకుమార్, ఇషిక సింగ్ హీరోయిన్లుగా నటిస్తున్న ఈచిత్రానికి స్టీవెన్ శంకర్ దర్శకత్వం వహిస్తున్నారు. ఆడియో విడుదల కార్యక్రమానికి యంగ్ డైరెక్టర్ మారుతి, హీరో సందీప్ కిషన్, దర్శకనిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ హాజరయ్యారు. ఈ సందర్భంగా హీరో సంపూర్ణేష్ మాట్లాడుతూ తాను పవన్ కళ్యాణ్ ఏకలవ్య శిష్యుడుననీ చెప్పడమే కాకుండా అచ్చు పవర్ స్టార్ మాదిరిగా ఫోజులు కొడుతూ సంపూర్ణేష్ బాబు ఇచ్చిన డాన్స్ పెర్ఫార్మెన్స్‌ అందర్నీ ఆశ్చర్య పరిచింది. ఈ వార్తలు ఇలా ఉండగా ప్రస్తుతం ఇతడి క్రేజ్ ఒక మెగా కుటుంబ హీరో ప్రమోషన్ కోసం వాడటం టాపిక్ అఫ్ టాలీవుడ్ అయ్యింది.  అల్లు వారి అబ్బాయి శిరీష్ క‌థానాయ‌కుడిగా `కొత్త జంట` అనే సినిమా తెర‌కెక్కుతోంది అన్న విషయం తెలిసిందే. మారుతి ద‌ర్శక‌త్వం వ‌హిస్తున్న ఈ సినిమాని త్వర‌లోనే ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు. ఈ సినిమా ప్రమోషన్ కోసం సంపూర్ణేష్‌బాబు పై కొన్నియాడ్స్ ఈ సినిమాకు సంభందించి చిత్రీక‌రించాడట‌ మారుతి. సంపు క్రేజ్ ను వాడుకొని `కొత్తజంట`ని ప్రమోట్ చేయాల‌ని అరవింద్ మారుతులు నిర్ణయించుకు న్నార‌ని టాక్. సామాన్యం గా మెగా కుటుంబం నుంచి సినిమా అంటే ప్రమోష‌న్‌కి ఢోకానే ఉండ‌దు. అవ‌స‌రం అనుకొంటే చిరంజీవి నుంచి అల్లు అర్జున్ వ‌ర‌కు అంద‌రూ రంగంలోకి దిగిపోతారు . కానీ మారుతి ‘కొత్త జంట’ పబ్లిసిటీ కోసం మెగా హీరోలను కాదని సంపూని నమ్ముకోవడమే హాట్ న్యూస్. 

మరింత సమాచారం తెలుసుకోండి: