ఒకొక్కసారి మనం ఎంత తెలివిగా అడుగులు వేస్తున్నా అనుకోని ఒక తప్పటడుగు మనకు రాబోయే బంగారం లాంటి అవకాసాలను జారవిడుస్తుoది. ఇటువంటి పరిస్థితే పూరికి ఎదురు అయ్యిందట . ఈ మాటలు స్వయంగా పూరి చెప్పడం విశేషం. దర్శకుడు పూరి జగన్నాధ్ ప్రస్తుతం ఓభారీ సక్సెస్ కోసం చూస్తున్నాడు అన్నవిసయం తెలిసిందే. ఇప్పటికే తన కెరియర్ లో ఎత్తు పల్లాలు అన్నీ చూసిన పూరికి ప్రస్తుతం డౌన్ ట్రెండ్ నడుస్తోంది. మళ్లీ పూరి పుంజుకోవాలంటే ‘పోకిరి’ లాంటి బ్లాక్ బస్టర్ పడాలి. అందుకే ప్రస్తుతం పూరి ఆ ప్రయత్నాలు జూనియర్ తో చేయబోతున్నాడు. ఈ నేపధ్యంలో ఒక ప్రముఖ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తాను మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ వలన నష్ట పోయానని చెప్పి మరో సంచలనానికి తెర తీసాడు. ఇక వివరాలలోకి వెళ్ళితే పూరి ఇప్పటికే బాలీవుడ్ లో కూడా దర్శకుడిగా పరిచయం అయినా కానీ అక్కడ స్టార్ దర్శకుడిగా పేరు రాలేదు. కానీ తన తన బ్లాక్ బస్టర్ సినిమాను ప్రభుదేవా ఇంచుమించు కాపీగా దింపేసి బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ గా మారిపోయాడు. అయితే పూరికి పోకిరి సినిమాను రీమేక్ చేయమని ఆఫర్ ముందుగా సల్మాన్ పూరీకే ఇచ్చాడట. అయితే పూరి అప్పుడు మెగా మాయలో పడి రామ్ చరణ్ ను ‘చిరుత’ గా పరిచయం చేసే పనిలో ఉన్నానని సరిగ్గా ఆ సమయంలోనే ‘వాంటెడ్’ సినిమా హిందీ రీమేక్ మొదలు అయ్యిందని దానితో చేసేది లేక సల్మాన్ ఆఫర్ వాదులు కున్నాను అని చెపుతూ తాను జీవితంలో చేసిన పోరపాట్లలో ఇది ఒకటి అని గతం గుర్తుకు చేసుకుంటున్నాడు పూరి. ఏమైనా గడిఛిపోయిన గతం గురించి ఎంత భాద పడ్డా ప్రయోజనం లేదు కదా.   

మరింత సమాచారం తెలుసుకోండి: