నిన్న ప్రారంభమైన మెగా బ్రదర్ నాగబాబు కొడుకు వరుణ్ తేజ్ సినిమాకు చాల సంవత్సరాల క్రితం వచ్చిన రామ్ చరణ్ సినిమా ఆరెంజ్ కు సంబంధం ఉంది ఆంటూ ఫిలింనగర్ లో వార్తల హడావిడి వినిపిస్తోంది. అయితే చరణ్ కెరియర్ లో ఫైల్యూర్ మూవీగా రికార్డు క్రియేట్ చేసుకున్న ‘ఆరెంజ్’ కధను వరుణ్ తేజ్ నటిస్తున్న ‘గొల్లభామ’ (వర్కింగ్ టైటిల్) సినిమా కధగా కనిపించబోతోంది అనే ఊహలకు తావు ఇవ్వకండి.  నిన్న ఘనంగా ప్రారంభమైన ఈ సినిమా ఓపెనింగ్ కు అభిప్రాయ భేదాలు ఎలా ఉన్నా? మెగా కుటుంబం అంతా కట్టకట్టుకుని వచ్చి వరుణ్ తేజ్ ను ఆశీర్వదించింది. ఇంత వరకు బాగుంది పేరుకు ఈ సినిమా నిర్మాతలు ‘ఠాగూర్’ మధు, నల్లమలపు శ్రీనివాసులే అయినా ఆర్ధిక విషయాలలో కొంతవరకు వెనుక ఉండి నడిపిస్తున్నది మెగా బ్రదర్ నాగబాబే అని అంటున్నారు. ఈ వార్తలలో ఎన్ని వాస్తాలో తెలియకపోయినా కొన్నేళ్ళ క్రితం నాగబాబును నిండా ముంచేసిన ‘ఆరెంజ్’ సినిమా దెబ్బ నుండి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న నేపధ్యంలో సినిమాలలో, బుల్లితెరపై నటిస్తూ కొద్దిగా గణిస్తున్న నాగబాబు తన కొడుకు కోసం మళ్ళీ ఇలాంటి సాహసం చేస్తాడా అంటు నిన్న సినిమా ప్రారంభోత్సవానికి వచ్చిన అతిధులు గుసగుసలాడు కోవడం ప్రస్తుతం టాలీవుడ్ లో హాట్ టాపిక్.   

మరింత సమాచారం తెలుసుకోండి: