ఒకప్పుడు సినిమాలు హీరోల స్టామినాతో నడిచేవి. కాని ఇప్పుడు సినిమాలు డైరెక్టర్ స్టామినాను బట్టి నడుస్తున్నాయి. కొత్త డైరక్టర్ అయినా టాలెంట్ ఉందంటే చాలు స్టార్ హీరోలు..పెద్ద ప్రొడక్షన్లు ఆఫర్లు ఇచ్చేస్తున్నాయి. ఒక్కసినిమాతోనే స్టార్ డైరక్టర్ గా ఎదిగుతున్న డైరక్టర్స్ ఎవరో మీరే చూడండి. టాలీవుడ్ ఇండస్ట్రీలో చాలా మంది కొత్త వారు వచ్చారు. న్యూ టాలెంట్ తో హవా కొనసాగించాలని మంచి కసితో ఉన్నారు యంగ్ టాలెంట్స్. సినిమా చాన్స్ కోసం కృష్ణా నగర్ లో ఎన్నో కష్టాలు పడుతున్న టాలెంటెడ్ పీపుల్ సరైన అవకాశం రాగానే రెచ్చిపోయి మరి తమ సత్తాని చూపిస్తున్నారు. ఈ కోవలోనే ఏమైంది ఈవేళ అనే చిన్న సినిమాతో డైరక్టర్ గా పరిచయమై రెండవ సినిమానే మెగా పవర్ స్టార్ రాం చరణ్ ని డైరెక్ట్ చేసిన రచ్చతో హిట్ కొట్టిన దర్శకుడు సంపత్ నంది ముందుంటాడు. వచ్చిన అవకాశాన్ని పర్ఫెక్ట్ గా యుటిలైజ్ చేసుకుని ఇప్పుడు పవర్ స్టార్ నే డైరెక్ట్ చేసేంతటి రేంజ్ కి వెళ్ళాడు. కష్ట పడితే ఏ ఇండస్ట్రీలో నైనా విజయం తప్పక వరిస్తుంది కాని సినిమా ప్రపంచంలో విజయం దక్కినా సరైన అవకాశాలు రావు అది కేవలం అదృష్టం మీద ఆధారపడి ఉంటుంది. కాని సంపత్ నంది ఆ విషయంలో సూపర్ అని చెప్పాలి. పవర్ స్టార్ స్టామినాను 10 సంవత్సరాల తర్వాత ప్రూవ్ చేసిన గబ్బర్ సింగ్ సినిమా సీక్వెల్ ని సంపత్ నంది డైరెక్ట్ చేస్తున్నాడన్న విషయం మనకు తెలిసిందే కదా.. ఆ సినిమాని సంపత్ సూపర్ హిట్ అయ్యేలా తీశాడంటే ఇక సంపత్ స్టార్ డైరక్టర్ల సరసన చేరిపోయినట్లే. ఈ కోవలో బలుపుకి రైటర్ గా పనిచేసి మొదటి సారి మెగా ఫోన్ పడుతున్న బాబి కూడా వస్తాడు. బలుపుకి రైటర్ గా పనిచేసిన బాబి వర్కింగ్ స్టైల్ ని మెచ్చిన రవితేజ. బాబి చెప్పిన కథకు బాబినే డైరక్టర్ గా పరిచయం చేస్తున్నాడు. ఈ సినిమాతో మరో కొత్త దర్శకుడికి అవకాశం ఇచ్చి మరోసారి మాస్ మహరాజా తన గొప్పతనాన్ని చాటుకున్నాడు. సో ఇక ఇప్పుడు చేయాల్సిందల్లా తన టాలెంట్ తో సినిమాను సూపర్ హిట్ చేయడమే.. సో చూద్దాం బాబి అదృష్టం ఎలా రాసిపెట్టుందో.. ఇక కొత్త దర్శకులకు అవకాశం ఇస్తున్న హీరోగా నితిన్ కూడా రికార్డ్ సృష్టించాడు. నితిన్ నెక్ష్ట్ చేస్తున్న మూవీని సురేందర్ రెడ్డి దగ్గర్ డైరెక్షన్ డిపార్ట్మెంట్ లో పనిచేసిన శ్రీనివాస్ రెడ్డి డేఇరక్షన్ చేస్తున్నాడు. టాలెంట్ ఉన్న వారికి పరిశ్రమ ఎప్పుడు అవకాశాలు ఇస్తుంది అని చెప్పడానికి ఇది కూడా ఒక ఉదాహరణ. ఈ సినిమా నితిన్ సూపర్ హిట్ బ్యాక్ టు బ్యాక్ హిట్స్ కొట్టిన శ్రేష్ఠ్ మూవీస్ బ్యానర్ సమర్పణాలో శ్రవనా అనే కొత్త బ్యానర్ లో నిర్మిస్తున్నారు నిఖితా రెడ్డి. ఈ లెక్కన చూస్తే టాలెంట్ ఉన్న టెక్నీషియన్స్ కి ఇండస్ట్రీ ఎప్పుడు పిలిచిమరి అవకాశాలు ఇస్తుంది అని మరోసారి ప్రూవ్ అయ్యింది. ఆఫర్లైతే ఎలా గోలా వస్తున్నాయి కాని ఈ అవకాశాలను వారు వినియోగించుకుని మంచి సినిమాలు తీస్తే నమ్మి ఆఫర్ ఇచ్చిన వారికి.. ఆఫర్ పొందిన వారికి లాభం ఉండే అవకాశం ఉంది. వచ్చిన అవకాశాల్ని ఉపయోగించుకుని మంచి సూపర్ హిట్ సినిమాలను ఆడియెన్స్ కి అందించాలని కోరుకుంటుంది ఎపిహెరాల్డ్.కామ్. ఈ ఆర్టికల్ పై మీ స్పందన..?

మరింత సమాచారం తెలుసుకోండి: