తన సినిమాలతో కామెడీ కితకితలు పెట్టే ఈ హీరో ఇప్పుడు సినిమాల విషయంలో చాలా స్లో అయ్యాడు.. ఒకప్పుడు ఒకే సంవత్సరంలో రెండు,మూడు సినిమాలను రిలీజ్ చేసే ఈ హీరో ఎందుకు ఇంతలా సినిమాలు లేట్ చేస్తున్నాడు. ఈ.వి.వి వారసుడిగా అల్లరి సినిమాతో హీరోగా పరిచయమయ్యాడు హీరో నరేష్. మొదటి సినిమాను తన ఇంటిపేరు గా మార్చుకున్న ఈ హీరో ఈ మధ్య సినిమాలు చేయడంలో చాలా వెనుకపడ్డాడు. ఒకప్పుడు సంవత్సరానికి మూడు నెలలకు ఓ సినిమా రిలీజ్ అయ్యేలా చూసుకునే అల్లరి నరేష్ ఎందుకిలా సినిమాలను నెగ్లెక్ట్ చేస్తున్నాడు. స్టార్ హీరోగా మాస్ సినిమాలు తనకు సూట్ అవ్వవని కేవలం కామెడీ హీరోగా.. పేరడి పాటలతో కూడా ఆడియెన్స్ ని ఎంటర్టైన్ చేస్తుంటాడు నరేష్.. ఆ తరహాలో మంచి మంచి హిట్ సినిమాలను కూడా తన ఖాతాలో వేసుకున్నాడు. నిత్య జీవితంలో బాధలు బంధాలతో బరువెక్కిన మనసు అల్లరి నరేష్ సినిమా చూస్తే చాలు కడుపుచెక్కలయ్యేలా నవ్వుకోవాల్సిందే. కాని ఇప్పుడు ఆ హీరోకి స్టోరీలు దొరక్క తెగ ఇబ్బందులు పడుతున్నాడని అతని సన్నిహితులు చెబుతున్నారు. ఆ కారణం చేతనే సినిమాలు కూడా అప్పట్లో లాగా రావట్లేదని అంటున్నారు. ఓకే చేసిన సినిమాలైనా స్పీడ్ గా కానిచ్చేస్తే బెటర్ కదా అని అంటున్నారు సిని అభిమానులు. దానికి కారణం లాస్ట్ ఇయర్ అనగా స్టార్ట్ చేసిన లడ్డూబాబు సినిమా ఇంకా రిలీజ్ అవ్వకపోవడమే. దానికి కారణం హీరో అల్లరి నరేష్ కన్నా రవిబాబు దే ఎక్కువ బాధ్యత ఉంటుంది. లడ్డూబాబు పరిస్తితి ఇలా ఉంటే ఆ సినిమా తర్వాత ఒక్క సినిమా కూడా స్టార్ట్ చేయలేదు. లాస్ట్ ఇయర్ కూడా యముడికి మొగుడు,యాక్షన్ 3డి అని చేసిన ప్రయోగం కూడా దెబ్బతిన్నది. అందుకే ఆలోచించి సినిమాలు చేయబోతున్నాడని దాని కారణం చేతనే ఇంతవరకు ఏ సినిమాకు ఓకే చెప్పాలేదని చెబుతున్నాయి సినివర్గాలు. సో ఏది ఏమైనా అల్లరి నరేష్ మరో సారి తన పాత పంథాని కొనసాగించాలని కోరుకుంటున్నాడు సగటు ప్రేక్షకుడు. అల్లరి నరేష్ కెరియర్ స్లో అవడానికి కారణం ఏంటి..?

మరింత సమాచారం తెలుసుకోండి: