సౌత్ సినిమాల స్టామినాను బాలీవుడ్ రేంజ్ కి తీసుకెళ్ళిన ఓ డైరక్టర్ ఇప్పుడు తను నెక్ష్ట్ చేస్తున్న ప్రాజెక్ట్ విషయంలో చాలా కేర్ ఫుల్ గా ఉంటున్నాడు. ఆ సినిమాలో హీరో కూడా ఈ సినిమాపై ఎక్కువ కాన్సంట్రేట్ చేస్తున్నాడు. ఇంతకీ ఎవరా డైరక్టర్.. ఏంటా సినిమా..?తెలుసుకోవాలంటే లుక్ ఎట్ దిస్ స్టోరీ.. సౌత్ సినిమాలను నేషనల్ మూవీస్ గా తీర్చిదిద్దిన డైరక్టర్ శంకర్. శంకర్ సినిమా వస్తుందంటే చాలు ఆడియెన్స్ అంతా దానిలో ఏదో ఒక కొత్త విషయం ఉంటుంది అని ఆ సినిమా కోసం ఎదురుచూస్తుంటారు. శంకర్ కూడా ఆడియెన్స్ ఎక్స్ పెక్టేషన్ ని ఏ మాత్రం మిస్ అవ్వకుండా సినిమాలను తీస్తూ సూపర్ హిట్ కొడతాడు. ఆకోవలో వచ్చినవే జెంటిల్ మేన్.. భారతీయుడు..అపరచితుడు.. రోబో.. శంకర్ సినిమాలో హీరోకి సాధారణ మనిషిగానే కనిపిస్తూ సూపర్ మ్యాన్ లా సంచనాలు సృష్టిస్తాడు. శంకర్ సినిమాలు డబ్బింగ్ సినిమాలైనా టాలీవుడ్ లో కూడా అంతే మార్కెట్ ని సాధిస్తాయి. అపరచితుడు సినిమా కోలీవుడ్ లో ఎంత హిట్ అయ్యిందో.. టాలీవుడ్ లో కూడా అంతే సూపర్ హిట్ అయ్యింది. రోబో తర్వాత శంకర్ బాలీవుడ్ త్రి ఇడియట్స్ సినిమాను రీమేక్ చేసి ఫ్లాప్ ని చవిచూశాడు. ఒక విధంగా చెప్పాలంటే శంకర్ డైరెక్ట్ చేసే సినిమాల్లో ఏదో విషయం ఉండాలి. శంకర్ సోషల్ రెస్పాన్స్ బిలిటీని తన సినిమాల్లో బాగా చూపిస్తాడు. ప్రస్తుతం ఇప్పుడు అందరి చూపు అంతా శంకర్, విక్రం ల కాంబినేషన్లో వస్తున్న ఐ సినిమా గురిన్చే.. తెలుగులో మనోహరుడుగా రాబోతున్న ఈ సినిమాపై భారి అంచనాలున్నాయి. స్నేహితుడు తర్వాత చేస్తున్న సినిమాగా శంకర్ ఈ సినిమాతో తన పాత పంథాను మరోసారి చూపించబోతున్నాడు. ఈ సినిమాపై విక్రమ్ కూడా చాలా హోప్స్ పెట్టుకున్నాడు ఎందుకంటే శంకర్ అపరిచితుడు సినిమా ఇచ్చిన హిట్ తో మాములు సినిమాలతో విక్రమ్ హిట్ కొట్టలేకపోయాడు ఇప్పుడు అదే డైర్టర్ మరళ తిరిగి హిట్ ఇస్తేనే గాని తను కోలుకోలేడు. అందుకే ఈ సినిమాపై ఇద్దరు చాలా ఎకాగ్రతతో పనిచేస్తున్నారట. ఇక ఈ ఐ సినిమా గురించి మీడియా కి చిన్న ఊహ కూడా అందనివ్వడంలేదు డైరక్టర్ శంకర్. ఈ సినిమా అపరచితుడు కన్నా ఇంకా సూపర్ గా ఉండబోతున్నదని మాత్రం చిత్ర యూనిట్ చెబుతుంది. రవిచంద్రన్ ఈ సినిమాను ప్రొడ్యూస్ చేస్తున్నాడు. ఎమి జాక్సన్ విక్రమ్ తో జోడి కట్టనుంది. పీ.సి శ్రీరాం సినిమాటోగ్రఫీ అందిస్తున్న ఈ సినిమా ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతుంది. ఒక కెమికల్ వలన ప్రాబ్లమ్స్ లో పడ్డ వారిని హీరో ఎలా కాపాడాడు.. ఇంకా మనిషి కెమికల్ రియాక్షన్ వలన ఎన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాడనే విషయం మీద శంకర్ ఐ సినిమా రాబోతుందట. సో మరో అద్భుత సినిమాను ప్రేక్షకులను అందించనున్నాడు శంకర్. ఈ సినిమాతో విక్రమ్ కూడా లైం లైట్ లోకి రావాలని ఆశిస్తున్నాడు. అందుకే విక్రమ్ ఈ సినిమాకి ప్రాణం పెట్టి మరి కష్టపడుతున్నాడట. సో చూద్దాం అక్కడ ఐ.. ఇక్కడ మనోహరుడు గా రాబోతున్న సినిమా రిజల్ట్ ఎలా ఉండనుందో..

మరింత సమాచారం తెలుసుకోండి: