ఈ మధ్య మీడియాలో బాగా నలుగుతున్న సినిమా మ్యాటర్ ఏంటంటే 2 స్టేట్స్ అని వస్తున్న అర్జున్ కపూర్, అలియా భట్ ల సినిమా గురించే. రీసెంట్ గా హైవే సినిమా హిట్ కొట్టిన ఈ చిన్నది ఇప్పుడు వెంటనే ఓ బ్యూటిఫుల్ లవ్ స్టోరీ తో వస్తుంది. ఇది మాములు ప్రేమకథ కాదు రెండు రాష్ట్రాలకు సంబంధించిన ప్రేమకథ. అందుకే ఈ సినిమాపై ఫస్ట్ లుక్ పోస్టర్ నుండి సూపర్ క్రేజ్ వచ్చింది. ఈ సినిమాలో పంజాబి అయిన అర్జున్ కపూర్, తమిళియన్ అయిన అలియాభట్ తో ప్రేమలో పడతాడట. రెండు రాష్ట్రాలకు సమబంధించిన ప్రేమకథ కాబట్టి ఈ సినిమాకు కూడా 2 స్టేట్స్ అని పెట్టేశారు. ఈ సినిమా ట్రైలర్స్ చూస్తుంటే సినిమా సూపర్ హిట్ కొట్టేలా ఉంది. చెన్నై ఎక్స్ ప్రెస్ సినిమాల ఫార్ములా తెలుసుకున్న బాలీవుడ్ సిని దర్శకనిర్మాతలు ఇక ఇటు సైడ్ కూడా చూడటం మొదలుపెట్టారు. ఒకప్పుడు కేవలం అక్కడే షూటింగ్ జరుపుకునే ఆ సినిమాల్లో కనీసం మన సౌత్ సినిమాల ఎఫెక్ట్ గాని.. కనీసం ఇక్కడ సిటీల పేర్లు కూడా వాడేవారు కాదు. కాని ఇప్పుడు మన సినిమాలు వారికి పోటీనిస్తుండడంతో బాలీవుడ్ వారు కూడా ఇక్కడ వ్యవహారశైలిపై పడ్డారు. దానికి ముందు ఒక రూట్ ని వేసి సక్సెస్ కొట్టాడు బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్. ఎపిహెరాల్డ్.కామ్ కి మాత్రమే ఎక్స్ క్లూజివ్ గా అందిన సమాచారం ప్రకారం ఈ సినిమాలో రొమాన్స్ కేకపుట్టిస్తుందని సమాచారం. అంతేకాదు ఈ 2 స్టేట్స్ సినిమాలో కామెడీకి కూడా ఎక్కువ ఇంపార్టెన్స్ ఉందని బీ-టౌన్ సమాచారం. ఏది ఏమైనా ఓ డిఫరెంట్ టైటిల్ తో క్యూట్ జంట ని పెట్టి తీస్తున్న ఈ సినిమా సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నారు సిని అభిమానులు..  2 స్టేట్స్ సినిమాపై మీ స్పందన..?         

మరింత సమాచారం తెలుసుకోండి: