గత కొంతకాలంగా టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ వివిధ వ్యాపార సంస్థల వస్తువులకు బ్రాండ్ ప్రమోటర్ గానే కాకుండా మహిళల హక్కుల గురించి మహిళల సమస్యల గురించి జరుగుతున్న సామజిక ఉధ్యమాలలో కూడా చాల ఉత్సాహంగా పాల్గొంటున్నాడు. ఈమధ్యనే బాలీవుడ్ యాక్టర్ ఫరహాన్ అక్తర్ ‘మర్డ్’ సామాజిక కార్యక్రమ ప్రచార చిత్రానికి మహేష్ తన వాయిస్ ను జత చేసాడు  ఈ సంస్థ చేపడుతున్న ప్రచార కార్యక్రమాలలో మహేష్ తన గొంతుతో తెలుగులో వాయిస్ ఓవర్ ను అందించాడు. మహిళల హక్కుల గురించి అవగాహన కలిగిస్తూ మహిళల పట్ల గౌవరవం చూపించమని ప్రబోధించే ప్రచార కార్యక్రమం ఇది. దీనికి కొనసాగింపుగా మార్చి 8న జరగబోతున్న అంతర్జాతీయ మహిళా దినోత్సవం సదర్భంగా హైదరాబాద్ లో ఒక ముఖ్య కార్యక్రమంలో మహేష్ అతిధిగా పాల్గొనబోతున్నాడు. సాఫ్ట్ వేర్ కంపెనీ దిగ్గజం ఇన్ఫోసిస్ హైదరాబాద్ లోని గచ్చిబౌలి క్యాంపస్ లో నిర్వహించబోతున్న అంతర్జాతీయ మహిళా దినోత్సవ సెమినార్ కు మహేష్ బాబును ముఖ్య అతిధిగా పిలిచి గౌరవిస్తున్నారు. ప్రస్తుతం దేశంలోని మహిళల పరిస్థితి వారి హక్కులపై జరగబోతున్న ఈ సెమినార్ లో అతితక్కువగా మాట్లడే మహేష్ ఇటువంటి విస్త్రుత విషయంపై ఎలా మాట్లాడుతాడో చూడాలి. పబ్లిక్ ఫంక్షన్స్ కు దూరంగా ఉండే మహేష్ ఇలాంటి బహిరంగ కార్యక్రమాలకు ఇదే మొదటిసారి.. 

మరింత సమాచారం తెలుసుకోండి: