ప్రిన్స్ మ‌హేష్ బాబు ప్ర‌స్తుతం ఆగ‌డు మూవీకు సంబంధించిన రెగ్యుల‌ర్ షూటింగ్స్‌లో పార్టిసిపెట్ చేస్తున్నాడు. దూకుడు కాంబినేష‌న్ త‌రువాత వ‌స్తున్న మూవీ కావ‌డంతో ఈ మూవీపై అభిమానుల్లోనూ హై ఎక్స్‌పెక్టేష‌న్స్ ఉన్నాయి. ఆగ‌డు మూవీలో ప్రిన్స్ స‌ర‌స‌న తొలిసారిగ త‌మ‌న్నా హీరోయిన్‌గా న‌టిస్తుంది. ఇదిలా ఉంటే ఈ మూవీ త‌రువాత ప్రిన్స్ ఏ మూవీలో న‌టిస్తున్నాడు అనేదానిపై ప్రిన్స్ మ‌రోసారి క్లారిటి ఇచ్చాడు. దీనికి సంబంధించిన న్యూస్ ఎపిహెరాల్డ్‌.కామ్ ప్ర‌త్యేకంగా మీకు అందిస్తుంది. ఆగ‌డు మూవీ త‌రువాత ప్రిన్స్ మ‌హేష్‌బాబు న‌టించ‌బోతున్న చిత్రం యుటివి మోష‌న్స్ పిక్ఛ‌ర్స్‌లోది అని గ‌తంలో తెలుసు. అయితే ఈ మూవీకు మ‌హేష్‌బాబు ఓకె అన్నాడు కాని, ఎటువంటి కాల్షీట్స్ ఇవ్వ‌లేదు. ఈ ప్రాజెక్ట్‌కు డైరెక్ట‌ర్‌గా మిర్చి ఫేం డైరెక్ట‌ర్ కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వం చేస్తున్నాడు. రీసెంట్‌గా కొర‌టాల శివ‌కు ప్రిన్స్ మ‌హేష్‌బాబు త‌న బ‌ల్క్ కాల్షీట్స్‌ను ఇచ్చాడు. మే నుండి రెగ్యుల‌ర్ షూటింగ్స్ పెట్టుకోమ‌ని కొర‌టాల‌కు చెప్ప‌డంతో ఈ క్రేజీ ప్రాజెక్ట్ ప్రి ప్రొడ‌క్ష‌న్ పనులు ఊపందుకున్నాయి. ఈ మూవీ త‌రువాత మ‌హేష్‌బాబు పూరిజ‌గ‌న్నాధ్ కాంబినేషన్‌కు గ్రీన్ సిగ్న‌ల్ ఇస్తాడా, లేక మ‌ణిర‌త్నం కాంబిన‌నేష‌న్‌కు గ్రీన్ సిగ్న‌ల్ ఇస్తాడా అనేది ఇంకా తెలియాల్సింది. మొత్తానికి మ‌హేష్‌బాబు ఆగడు మూవీ త‌రువాత కొర‌టాల శివ మూవీకు ఓకె చెప్ప‌డంతో, ఈ ప్రాజెక్ట్ పై అంద‌రిలోనూ అంచ‌నాలు పెరుగుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: