రాఖీసావంత్‌కి రాజకీయాల మీదికి మనసు మళ్లడంతో ఈ ముద్దుగుమ్మ శనివారం ఢిల్లీలోని బీజేపీ ప్రధాన కార్యాలయానికి వచ్చి కాసేపు సందడి చేసింది. అంతేకాదు తాను బీజేపీ పార్టీకి కూతురులాంటిదాన్నని కూడా స్టేట్మెంట్ ఇచ్చేసింది. బిజెపి పార్టీ ఆఫీస్ తనకు సొంత ఇల్లులా వుందని వ్యాఖ్యానించింది. కాబోయే ప్రధాని నరేంద్రమోడి యేనంటున్న రాఖీసావంత్ - బీజేపీలో చేరే విషయమై ఇంకా నిర్ణయానికి రాలేదని తెలిపింది. ‘నేను ఏంచేస్తే మంచిదో సీనియర్ నేతలే చెబుతారు’ అని చెప్పింది. ఏదిఏమైనా బీజేపీలో రాఖీ చేరడం ఖాయమేనని వార్తలు జోరందుకుంటున్నాయి.  రాబోయే ఎన్నికల్లో ఈ హాట్ బ్యూటీ బీజేపీ టికెట్‌పై ఢిల్లీలో అరవింద్ కేజ్రీవాల్‌పై పోటీకి దిగవచ్చుననే ఊహాగానాలు బలంగా సాగుతున్నాయి. అయితే ఆమధ్య ఈ అమ్మడు రాహుల్‌గాంధీని కూడా పొగిడిన విషయాన్ని మరిచిపోరాదు. ఆమధ్య కేజ్రీవాల్ ను పొలిటికల్ ఐటమ్ గర్ల్ గా అభివర్ణించిన రాఖీ సావంత్ నిజంగా కేజ్రీవాల్ పై పోటీ చేస్తే అది ఒక సంచలనమే అవుతుంది.  రాజకీయ నాయకులకు ప్రజాకర్షణ తగ్గిపోవడంతో ఏదోవిధంగా ప్రజలను ఆకర్షించడానికి భారతీయ జనతాపార్టీ లాంటి జాతీయ పార్టీలు కూడ హాట్ బ్యూటీలను తమ పార్టీ అభ్యర్ధులుగా నిలబెడితే దేశరాజకీయాలు ఏస్థాయిలో పతనావస్థలో ఉన్నాయో అర్ధం అవుతుంది.  

మరింత సమాచారం తెలుసుకోండి: