ప్రిన్స్ మ‌హేష్‌బాబు న‌టిస్తున్న అప్‌క‌మింగ్ మూవీ ఆగ‌డులో ఆరుగురు బిగ్ స్టార్స్ న‌టిస్తున్నారు. మ‌హేష్‌బాబుతో పాటు వీరు సైతం ఆగ‌డు మూవీకు మ‌రింత బ‌లాన్ని, స‌క్సెస్‌ను చేకూరుస్తార‌ని డైరెక్ట‌ర్ శ్రీనువైట్ల న‌మ్మ‌కాల‌ను పెట్టుకున్నాడ‌ట‌. దీనికి సంబంధించిన స‌మాచారాన్ని ఎపిహెరాల్డ్‌.కామ్ ప్ర‌త్యేకంగా మీకు అందిస్తుంది. దూకుడు మూవీకు సీక్వెల్‌గా తెర‌కెక్కుతున్న‌ ఆగడు మూవీపై టాలీవుడ్ ఫిల్మ్ ఇండ‌స్ట్రీలో తెగ ఆస‌క్తి నెల‌కొంది. ఆగ‌డు మూవీలో మ‌హేష్‌బాబుతో పాటు న‌టిస్తున్న కో స్టార్స్ కూడ మూవీ స‌క్సెస్‌కు మ‌రింత ఉప‌యోగ‌ప‌డ‌తార‌ని చిత్ర యూనిట్ చెబుతుంది. ఈ మూవీలో స్టార్ యాక్ట‌ర్ రాజేంద్ర‌ప్ర‌సాద్‌, ప్ర‌కాష్‌రాజ్‌, బ్ర‌హ్మానందం, సాయికుమార్‌, త‌మిళ్ యాక్ట‌ర్ నెపోలియ‌న్‌, క్రేజీ యాక్ట‌ర్ న‌దియా ఇందులో నటిస్తున్నారు. మ‌హేష్‌బాబు పాత్ర‌కు ఏ మాత్రం త‌గ్గ‌కుండా ఈ క్యారెక్ట‌ర్స్ ఆగ‌డు మూవీ స‌క్సెస్‌కు తోడ్ప‌డ‌తార‌ని చిత్ర‌యూనిట్ భావిస్తుంది. ప్ర‌స్తుతం ఆగ‌డు మూవీ రెగ్యుల‌ర్ షూటింగ్స్ శ‌ర‌వేగంగా జ‌రుపుకుంటుంది. ఈ మూవీలో మ‌హేష్‌బాబుకు జోడిగా త‌మ‌న్న మొద‌టిసారిగా హీరోయిన్‌గా చేస్తుంది. ఆగ‌డు మూవీ షూటింగ్ అనంత‌రం ప్రిన్స్ మ‌హేష్‌బాబు కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వంలో న‌టించ‌బోతున్నాడు. మొత్తానికి ఈసారి దూకుడు మూవీలోని క్యారెక్ట‌ర్స్‌ను ప‌బ్లిసిటి కోసం శ్రీనువైట్ల ఉప‌యోగించుకుంటున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: