టాలీవుడ్ ఫిల్మ్ ఇండ‌స్ట్రీలో త‌న‌దైన స్టార్‌డంను సొంత చేసుకున్న యాక్ట‌ర్ ర‌వితేజ‌. ర‌వితేజ మూవీలు అన్ని ఒకే మూస ధోర‌ణిలో ఉంటాయి అన్న టాక్ ఇండ‌స్ట్రీలో ఉన్న‌ప్ప‌టికి, త‌న ప్ర‌తి మూవీను సినీ ప్రేక్ష‌కులు ఆద‌రిస్తూనే ఉంటారు. ఇదిలా ఉంటే రీసెంట్‌గా వ‌చ్చిన బ‌లుపు స‌క్సెస్‌తో ర‌వితేజ తన మూవీల‌పై ప‌క్కా ప‌ధ‌కం ప్ర‌కారం ముందుకు వెళుతున్నాడు. అయితే ర‌వితేజ త్వ‌ర‌లోనే ఓ మ‌ల్టీస్టార‌ర్ ఫిల్మ్‌లో న‌టించేదుకు సిద్ధంగా ఉన్నాడ‌ని టాలీవుడ్‌లో టాక్స్ వినిపిస్తున్నాయి. టాలీవుడ్‌లో వినిపిస్తున్న స‌మాచారం మేర‌కు ర‌వితేజ మ‌ల్టీస్టార‌ర్ ఫిల్మ్‌కు సంబంధించిన న్యూస్‌ను ఎపిహెరాల్డ్‌.కామ్‌కు ప్ర‌త్యేకంగా మీకు అందిస్తుంది. ర‌వితేజ‌, వెంక‌టేష్ కాంబినేషన్‌లో ఓ మూవీకు రంగం సిద్ధం అవుతుంది. ఈ క్రేజీ ప్రాజెక్ట్‌ను డైరెక్ట‌ర్ వీరుపోట్ల సెట్స్ మీద‌కు తీసుకుపోతున్నాడు. వీరుపోట్ల రవితేజ కాంబినేష‌న్‌తో ఉన్న ఓ క‌థ‌ను వెంక‌టేష్‌కు వివ‌రించ‌గా, ఆ క‌థ‌ దాదాపు ఓకె అయింద‌ని స‌మాచారం. క‌థ విన్న త‌రువాత 'ర‌వితేజ మూవీలో కామెడీ భ‌లే ఉంటుంది. యాక్ష‌న్ కూడ బాగుటుంది. నేను ఎప్పుడో రెడీ త‌న‌తో. మ‌రో సారి పూర్తి క‌థ‌తో కూర్చుందాం' అంటూ వీరుపోట్ల‌కు వెంక‌టేష్ చెప్పాడంట‌. దీంతో వీరుపోట్ల కేవ‌లం సింగిల్ లైన్‌తో చెప్పిన స్టోరిను పూర్తి క‌థ‌గా డెవ‌లెప్ చేసి త్వ‌ర‌లోనే వెంక‌టేష్‌కు చెప్ప‌టానికి సిద్ధంగా ఉన్నాడు. అన్ని ఓకే అయితే, వీరిద్ద‌రి కాంబినేష‌న్‌లో 2015లో ర‌వితేజ‌, వెంక‌టేష్ మ‌ల్టీస్టార‌ర్ ప్రాజెక్ట్ సెట్స్ మీద‌కు పోవ‌చ్చ‌ని టాలీవుడ్ అంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: