ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ అంటే టాలీవుడ్ ఫిల్మ్ ఇండ‌స్ట్రీలో అంద‌రికి ఓ క్రేజ్‌. ఆ విష‌యం అంద‌రికి తెలిసిందే. ఇదిలా ఉండే రీసెంట్‌గా ప‌వ‌న్ క‌ళ్యాణ్ వ్య‌క్తిగ‌త జీవితంపైన‌, అలాగే ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, చిరంజీవి మ‌ధ్య విభేదాలుపైనా ఎక్కువుగా గాసిప్స్ వినిపిస్తున్నాయి. ప‌వ‌న్ క‌ళ్యాణ్ మూడో మ్యారేజ్ చేసుకోవ‌డం, ప‌వ‌న్ క‌ళ్యాణ్ రాబోతున్న ఎన్నిక‌ల్లో ఎం.పిగా పోటీ చేస్తాడ‌నుకోవ‌డం, అలాగే కొత్త పార్టీను పెట్టి అన్న పార్టీలాగా కాకుండా స‌రికొత్త సిద్ధాంతాల‌తో దాన్ని ముందుకు తీసుకుపోతాడ‌ని వంటి ర‌క‌ర‌కాల వార్త‌లు వినిపిస్తున్నాయి. ఇదిలా ఉంటే ఈ వార్త‌ల‌పై ప‌వ‌న్ క‌ళ్యాణ్ స్పందించాడు. దీనికి సంబంధించిన స‌మాచారాన్ని ఎపిహెరాల్డ్‌.కామ్ ప్ర‌త్యేకంగా మీకు అందిస్తుంది. కేవలం స్పంధించ‌డ‌మే కాకుండా, మీడియాకు ఓ ప్రెస్‌నోట్‌ను సైతం రిలీజ్ చేశాడు. ఆ ప్రెస్ నోట్ లో ‘ చిరంజీవి గారికి పవన్ కళ్యాణ్ గారికి మధ్య ఎలాంటి మనస్పర్ధలు లేవు. అలాగే పవన్ కళ్యాన్ రాజకీయాల్లోకి వస్తారని, కొత్త పార్టీ పెడతారని వస్తున్న వార్తలపై పవన్ కళ్యాణ్ గారే మార్చి రెండవ వారంలో ప్రెస్ మీట్ పెట్టి క్లియర్ చేస్తారని’ తెలిపారు. దీంతో ఆ ప్రెస్‌మీట్‌పై స‌ర్వ‌త్రా చ‌ర్ఛ‌నీయాంశంగా మారింది. ప‌వ‌న్ క‌ళ్యాణ్ పెట్ట‌బోతున్న ఆ ప్రెస్‌మీట్ లో ప‌వ‌న్ ఏ విష‌యాల‌ను గురించి ఎక్కువుగా స్పందిస్తాడు? పొలిటిక‌ల్ పార్టీపై గురించి రిపోర్ట‌ర్లు ఎటువంటి ప్ర‌శ్న‌లు అడిగితే ఏ విధంగా స‌మాధానం ఇస్తాడు వంటి విష‌యాలు చాలా ఆస‌క్తిగా మారాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: