మెగా హీరో రామ్‌చ‌ర‌ణ్ న‌టిస్తున్న అప్‌కమింగ్ ఫిల్మ్ , కృష్ణ వంశీ ద‌ర్శ‌క‌త్వంలో రూపుదిద్దుకుంటుంది. ఈ మూవీకు సంబంధించిన షూటింగ్ ప్ర‌స్తుతం క‌న్యాకుమారిలో జ‌రుగుతుంది. ఇదిలా ఉంటే ఈ మూవీ షూటింగ్‌ షెడ్యూల్స్ త్వ‌ర‌లోనే పూర్తి చేసుకొని, ఇండియాకు తిరిగి రాబోతుంది. దానికి సంబంధించిన డిటైల్స్‌ను ఎపిహెరాల్డ్‌.కామ్ ప్ర‌త్యేకంగా మీకు అందిస్తుంది. రామ్‌చ‌ర‌ణ్‌, కృష్ణ‌వంశీ మూవీలోని కీల‌క స‌న్నివేశాలు, క‌న్‌టిన్యూటి స‌న్నివేశాల‌ను క‌న్యాకుమారిలోనే చిత్రీక‌రిస్తున్నారు. ఈ మూవీలో రామ్‌చ‌ర‌ణ్ స‌ర‌స‌న కాజ‌ల్ హీరోయిన్‌గా చేస్తుంది. అలాగే శ్రీకాంత్ స‌ర‌స‌న క‌మ‌లినిముఖ‌ర్జీ హీరోయిన్‌గా చేస్తుంది. కృష్ణ‌వంశీ గ‌తంలో తీసిన ఫ్యామిలి ఓరియంటెడ్ మూవీల కంటే ఈ మూవీ కంప్లీట్ డిప్రెంట్ మూవీగా తెర‌కెక్క‌బోతుంది. ఈ మూవీపై కృష్ణ‌వంశీ చాలా న‌మ్మ‌కాల‌ను పెట్టుకున్నాడు. ఇది క‌చ్ఛితంగా బ్లాక్‌బ‌స్ట‌ర్ స‌క్సెస్‌ను సాధించ‌డం ఖాయం అని కృష్ణ‌వంశీతో పాటు చిత్ర యూనిట్ సైతం చాలా బ‌లంగా న‌మ్ముతుంది. ఇదిలాఉంటే ఈ నెల 27న మెగాప‌వ‌ర్‌స్టార్ రామ్‌చ‌ర‌ణ్ పుట్టిన‌రోజు కావ‌డంతో, క‌న్యాకుమారి షెడ్యూల్‌ను 25 వ‌ర‌కూ జ‌రుపుకొని, అక్క‌డ నుండి 26వ తేధీ రామ్‌చ‌ర‌ణ్ హైద‌రాబాద్‌కు చేరుకుంటాడు. 27వ తేధీ పుట్టిన‌రోజుతో పాటు, ఈ మూవీకు సంబంధించిన ఫ‌స్ట్‌లుక్‌ను సైతం రిలీజ్ చేస్తారు. మొత్తానికి రామ్‌చ‌ర‌ణ్ పుట్టిన‌రోజు నాడు మెగా అభిమానుల‌కు డ‌బుల్ హ్యాపీ క‌లుగుతున్న‌మాట‌.

మరింత సమాచారం తెలుసుకోండి: