జూనియర్ కు ‘రభస’ కష్టాలు వదలడంలేదు. ఆ చిత్ర దర్శకుడు సంతోష్‌ శ్రీనివాస్‌ అనారోగ్యం పాలవడంతో షూటింగ్‌కి బ్రేక్ పడిందని గతంలోనే వార్తలు వచ్చాయి. అయితే జూనియర్ సలహా మేరకు డైరెక్టర్‌ లేకుండా పాటల చిత్రీకరణ ప్రయత్నం చేసారు. అయితే దాని అవుట్ పుట్ జూనియర్ కు నచ్చలేదట. ఈవార్త తెలుసుకున్న దర్శకుడు సంతోష్ శ్రీనివాస్ ఏదోవిధంగా సెట్ పైకి వచ్చి కష్టపడదాం అని ప్రయత్నించినా అతడి కామెర్ల అనారోగ్యం మళ్ళీ తిరగ పెట్టడంతో ఎక్కువ సేపు సెట్లో ఉండే పరిస్థితి కలగడం లేదట. వైధ్యులు అతడికి పూర్తి బెడ్ రెస్ట్ అవసరం అని చెప్పడంతో ఇక చేసేది లేక జూనియర్ ఈ సినిమా పై ఆశలు వదులుకుని పూరి జగన్నాద్ కు కబురు పెట్టాడు అనే వార్తలు వస్తున్నాయి. అంతేకాదు పూరి దగ్గర కధ పూర్తి అయితే గేప్ లేకుండా పూరీ సినిమాను అయినా పూర్తి చేద్దామని ఆలోచనలో ఉన్నాడట జూనియర్. అదీకాక త్వరలో రాబోతున్న ఎన్నికలలో గతంలో మాదిరిగా ఎన్నికల ప్రచారంలో పాల్గొనాలని జూనియర్ కు ఉద్దేశ్యం లేదు అని అంటున్నారు. పూరి సినిమా వంక పెట్టుకుని రాబోతున్న ఎన్నికల ప్రచారానికి దూరంగా ఉండాలని ఇప్పటికే జూనియర్ గట్టి నిర్ణయం తీసుకోవడంతో పూరీ కొత్త సినిమాను వీలైనంత త్వరగా పట్టాలు ఎక్కించే ఉద్దేశ్యంలో జూనియర్ ఉన్నాడు అని అంటున్నారు. జూనియర్ పచ్చజెండా ఉపాడు కాబట్టి ఇక పూరీ ఎదో ఒక హాలిడే స్పాట్ కు వెళ్ళి కధ చుట్టేస్తాడనే అనుకోవాలి.  

మరింత సమాచారం తెలుసుకోండి: