త‌మిళ్ డైరెక్ట‌ర్ శంక‌ర్ అంటే తెలియని సినీ ప్రేక్ష‌కుడు ఉండ‌డు. శంక‌ర్ సంవ‌త్స‌రానికో, రెండు సంవ‌త్స‌రాల‌కో ఒక మూవీను తీసినా, త‌న మూవీ ఇండియ‌న్ బాక్సాపీస్‌ను షేక్ చేసేంత‌గా ఉంటుంది. అందుకే శంక‌ర్ మూవీలు అంటే అంత క్రేజ్ ఉంటుంది. ఇదిలా ఉంటే శంక‌ర్‌తో ఎక్కువ మూవీలు చేసిన హీరోగా విక్ర‌మ్ నిలిచిపోయాడు. తాజాగా వీరిద్ద‌రి కాంబినేష‌న్‌లో వ‌స్తున్న ఐ చిత్రం ఏ విధంగా ఉండ‌బోతుందో అంటూ యావ‌త్ ఇండియ‌న్ ఫిల్మ్ ఇండ‌స్ట్రీ ఎంతో ఆస‌క్తిగా ఎదురుచేస్తుంది. ఇదిలా ఉంటే ఈ శంక‌ర్ హీరో విక్ర‌మ్ స‌ర‌స‌న బ‌బ్లీ బ్యూటి హ‌న్సిక హీరోయిన్‌గా న‌టిస్తుంది. హ‌న్సిన తాజాగా విక్ర‌మ్‌తో న‌టించేందుకు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చింది. కోలీవుడ్ ఫిల్మ్ ఇండ‌స్ట్రీలో హ‌న్సిక టాప్ హీరోయిన్‌గా కొన‌సాగుతుంది. కేవ‌లం టాప్ హీరోయిన్‌గా మాత్ర‌మే కాకుండా ఇత‌ర హీరోల‌తో ఎఫైర్‌ల‌ను కూడ న‌డుపుతూ ఎప్పుడు కోలీవుడ్ మీడియాకు హాట్ టాపిక్‌గా మారుతుంది. హ‌న్సిక కొత్త మూవీ ప్రాజెక్ట్‌కు సంబంధించిన న్యూస్‌ను ఎపిహెరాల్డ్‌.కామ్ ప్ర‌త్యేకంగా మీకు అందిస్తుంది. ధరణి దర్శకత్వంలో విక్రమ్ సినిమాలో హన్సిక ను హీరొయిన్ గా ఎంపిక చేసార‌ని సమాచారం. ఈ సినిమాకు విద్యాసాగర్ దర్శకుడు. హ‌న్సిక ప్ర‌స్తుతం నాగ చైతన్య దుర్గ, రామ్ ‘పండగ చేస్కో’ సినిమాలలో నటించనుంది. రీసెంట్‌గా హ‌న్సిక‌, శింబుల ఎఫైర్ హాట్ టాపిక్‌గా నిలిచింది. కోలీవుడ్ ఫిల్మ్ ఇండ‌స్ట్రీలో హ‌న్సిక‌ నెంబ‌ర్ వ‌న్ స్థానానిగా లేటెస్ట్‌గా పోటీ వ‌స్తున్న హీరోయిన్ ఎవ‌రు? ఈ టాపిక్‌పై మీ కామెంట్స్‌ను ఇక్క‌డ తెలియ‌ప‌ర‌చండి.

మరింత సమాచారం తెలుసుకోండి: