ఒక వైపు పవన్ కళ్యాణ్ రాజకీయ పార్టీ పెట్టేస్తాడు అనే వార్తలు హడావిడి చేస్తూ ఉంటే మరో విచిత్ర బహిరంగ ప్రకటన చేసాడు దిల్ రాజ్. పవన్ కళ్యాణ్ ఒప్పుకుంటే తెలంగాణా నేపద్యం లో తాను సినిమా తీయ్యడానికి ఇప్పుడు రెడీగా ఉన్నాను అని ప్రకటించడం హాట్ టాపిక్ గా మారింది. తెలంగాణా నేపధ్యంలో పవన్ తో సినిమా చేద్దామని అప్పట్లో ప్రముఖ గాయకుడు గద్దర్ అన్నారని, అయితే అప్పటి పరిస్థితుల వల్ల అది సాధ్యపడలేదని, కాని పవన్ ఒప్పుకుంటే ఇప్పుడు తాను రెడీ గా ఉన్నానని దిల్ రాజు వెల్లడించారు. తెలంగాణా రాష్ట్రం ఏర్పడిన సందర్భంగా దర్శకుడు శంకర్ ఏర్పాటు చేసిన జై బోలో తెలంగాణా విజయోత్సవ వేడుకలో దిల్ రాజ్ ఈ ప్రకటన చేసాడు.  ఇదే సందర్భంలో లో దిల్ రాజు మాట్లాడుతూ సినిమా రంగం అనేది డబ్బుతో కూడుకున్న విషయమని, డబ్బు వ్యవహారాలను చూసిన తరువాతే ఎ సినిమా అయిన ముందుకు వెళ్తుందని అన్నాడు. అంతేకాదు తెలంగాణా ప్రాంత నటీనటులకు సాంకేతిక నిపుణులకు పని కల్పించడానికి తాను ఎప్పుడు ముందు ఉంటానని వాగ్దానం చేసాడు దిల్ రాజ్.  పవన్ అభిమానులను ఊరిస్తున్న ‘గబ్బర్ సింగ్-2’ సినిమాకు ఇంతకు వచ్చి మోక్షం లేని పరిస్థుతులలో పవన్ తెలంగాణ సినిమా ఎప్పుడు చేస్తాడు అన్నదే ప్రశ్న?  

మరింత సమాచారం తెలుసుకోండి: